రివ్యూవర్స్‌ కు టాప్‌ హీరో విజ్ఞప్తి

Update: 2018-09-26 10:31 GMT
తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు - నడిగర్‌ సంఘం జనరల్‌ సెక్రటరీ అయిన విశాల్‌ చిన్న చిత్రాల కోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. అదే సమయంలో పెద్ద సినిమాల నిర్మాతలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీలో - మేకింగ్‌ విషయంలో పలు మార్పులు తీసుకు వచ్చాడు. పైరసీపై ఓ రేంజ్‌ యుద్దం చేస్తున్న విశాల్‌ తాజాగా ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తితో మీడియా ముందుకు వచ్చాడు. త్వరలో విశాల్‌ హీరోగా నటించిన ‘పందెంకోడి 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రివ్యూవర్స్‌ కు ఒక విజ్ఞప్తిని విశాల్‌ చేశాడు.

సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూలు రాయకుండా ఉండమంటూ మీడియా వారికి విజ్ఞప్తిని చేశాడు. సినిమా విడుదల కాగానే రివ్యూలు రావడం వల్ల నిర్మాతలు చాలా నష్టపోతున్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రివ్యూలు రావడం వల్ల కోట్లల్లో బడ్జెట్‌ పెట్టి తీసిన సినిమాలు తీవ్రంగా నష్టాలపాలవ్వాల్సి - మూడు రోజులు రివ్యూలు ఆగితే నిర్మాతకు చాలా వరకు నష్టం తగ్గుతుందని విశాల్‌ అంటున్నాడు.

పెద్ద సినిమాలకు రివ్యూలు నష్టం చేకూర్చుతున్నామో కాని చిన్న చిత్రాలకు మాత్రం రివ్యూలు చాలా హెల్ప్‌ అవుతున్నాయి అనేది చిన్న నిర్మాతల అభిప్రాయం. మూడు రోజుల పాటు సినిమా విడుదలైన తర్వాత రివ్యూలు రాకుంటే చిన్న చిత్రాలు చాలా లాస్‌ అవ్వాల్సి వస్తుందని ఈ సందర్బంగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కేవలం పెద్ద సినిమాలను దృష్టిలో పెట్టుకుని విశాల్‌ మాట్లాడటం ఏమాత్రం బాగా లేదని - ఆయన అధ్యక్షుడిగా అందరి మంచిని చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కోలీవుడ్‌ లో టాక్‌ వినిపిస్తుంది. అయినా విశాల్‌ విజ్ఞప్తి చేసినంత మాత్రాన రివ్యూలు ఆగవు అనేది మరికొందరి వాదన.
Tags:    

Similar News