పొగరు ఒగరు ఉన్న పందెంకోడిని అని మరోసారి నిరూపించాడు విశాల్. ఒక తెలుగు వాడి విజయ గర్వమిది. తెలుగు గడ్డపై పుట్టి - తంబీల మెడలు ఒంచుతున్న వీరుడి కథ ఇది. మీసం రోసం పొగరు ఒగరున్నోడి గెలుపు కథ ఇది.
గత కొంతకాలంగా తమిళ నిర్మాతల మండలిలో సాగుతున్న గొడవల గురించి తెలిసిందే. అక్కడ తెలుగు కుర్రాడైన విశాల్ ఆధిపత్యాన్ని సహించలేని కొందరు ప్రత్యర్థులు విశాల్ పై కత్తి కట్టారన్న ప్రచారం సాగుతోంది. ప్రత్యర్థుల గుంపు అతడిపై కక్ష తో సాధింపులకు దిగారు. అయితే `పందులన్నీ గుంపుగా వస్తాయి` అని సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ చందంగా అవన్నీ పందులేనని నిరూపించాడు విశాల్. పందులన్నిటినీ ఇప్పుడు మండలి ప్రాంగణం నుంచి బయటికి పంపే పనిలో ఉన్నాడు. మొండోడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. దిల్లీకే ఎదురెళ్లిన బాద్ షా మన విశాల్. ఎన్నో మంచి పనులు చేశాడు. ఇప్పుడు ఏకంగా నిర్మాతల మండలికి సొంత బిల్డింగ్ నిర్మించి తీరుతానని పంతంతో ముందుకెళుతున్నాడు.
ఆ క్రమంలోనే తనని వ్యతిరేకించిన 20 మంది నిర్మాతలకు నోటీసులు పంపించాడు. జనరల్ బాడీ మీటింగ్ లో ఆ మేరకు తీర్మానం చేశాడు. ప్రత్యర్థుల పీచమణచడంలో - ఎదురెళ్లడంలో వీరుడని నిరూపిస్తున్నాడు. నిర్మాతల కార్యాలయానికి తాళం వేసిన ప్రత్యర్థుల పీచమణుస్తున్నాడు. ఇప్పటికే వాళ్లందరికీ నోటీసులు జారీ అయ్యాయి. ఇక తక్షణం నిధి సేకరణ పనుల్లోకి దిగిపోతున్నాడు. నిర్మాతల మండలికి నిధుల సేకరణ కోసం నిర్వహించతలపెట్టిన `ఇళయరాజా 75` కార్యక్రమం ఏర్పాట్లను చేస్తున్నాడు. 2019 ఫిబ్రవరి 2 - 3 తేదీల్లో ఇళయరాజా పాటలతో భారీ సంగీత కచేరీ నిర్వహించనున్నాడు. విశాల్ తప్పు చేశాడా? అన్నంతగా భ్రమింపజేసిన శత్రువర్గాలు ఇప్పుడు చాప చుట్టుకుపోవడం ఖాయం అన్న చర్చా సాగుతోంది. అసలు విశాల్ పనైపోయింది అంటూ సాగించిన ప్రచారాన్ని అతడు ధీరుడిలా తిప్పి కొట్టిన తీరు ప్రస్తుతం చర్చకొచ్చింది.