మహేష్ బాబు రీసెంట్ మూవీ స్పైడర్. ఈ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేయడానికి చాలా సమయమే తీసుకున్నారు. స్పైడర్ పేరు అనౌన్స్ చేయకముందు అనేక పేర్లు వినిపించాయి. వీటిలో అభిమన్యుడు కూడా ఒకటి. అయితే.. ఈ పేరు విషయంలో సూపర్ స్టార్ పూర్తి సంతృప్తి ప్రకటించకపోవడంతో.. చివరకు సినిమా థీమ్ కు తగినట్లుగా స్పైడర్ అనే పేరును ఖాయం చేసుకున్నాడు. ఇప్పుడు అదే పేరును కోలీవుడ్ హీరో విశాల్ ఉపయోగించేసుకుంటున్నాడు.
రీసెంట్ గా డిటెక్టివ్ మూవీతో జనాలను ఆకట్టుకున్నాడు విశాల్. మళ్లీ రెండు నెలల గ్యాప్ లోనే ఈ హీరో మరో సినిమాను రిలీజ్ చేసేయనున్నాడు. పొంగల్ కు ఇరుంబు తిరాయ్ అనే మూవీతో ఆడియన్స్ ముందుకు రానున్నాడు విశాల్. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ సమంత హీరోయిన్ కావడంతో.. తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ పనులను కూడా ఇప్పటికే చక్కబెట్టేస్తుండగా.. ఇప్పుడీ చిత్రం తెలుగు వెర్షన్ కు పేరు ఫిక్స్ చేసేశారు.
తమిళ్ వెర్షన్ పేరు ఇరుంబు తిరాయ్ అంటే.. ఇనుప తెర అని అర్ధం. కానీ తెలుగు వెర్షన్ కు మాత్రం అభిమన్యుడు అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. యాక్షన్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో అభిమన్యుడు రూపొందుతుండగా.. యాక్షన్ కింగ్ గా గుర్తింపు పొందిన అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.