టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఈగ ను పెట్టి సినిమా చేశాడు. హాలీవుడ్ కే పరిమితం అయిన ఇలాంటి కాన్సెప్ట్ ను జక్కన్న టాలీవుడ్ లో తీయడంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా షాక్ అయ్యారు. అద్బుతమైన విజువల్స్ తో చాలా నాచురల్ గా చక్కగా ‘ఈగ’ చిత్రాన్ని తెరకెక్కించిన జక్కన్న సూపర్ హిట్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. సూపర్ హిట్ ‘ఈగ’ను ఇన్సిపిరేషన్ గా తీసుకున్నాడో లేక మరేమో కాని రవిబాబు తాజాగా పంది పిల్ల ప్రధాన పాత్రగా ‘అదుగో’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈగ చిత్రం మాదిరిగానే అదుగో కూడా చాలా కాలం పట్టింది. రవిబాబు విభిన్నత్వంకు మారు పేరు. అందుకే అదుగో తప్పకుండా ఆకట్టుకుంటుందని అంతా అనుకున్నారు. కాని అదుగో ఆకట్టుకోలేక పోయింది. రవిబాబు ఫ్లాప్ అయిన సబ్జెక్ తోనే విశాల్ సినిమా తీయాని భావిస్తున్నాడట.
తాజాగా విశాల్ వచ్చే ఏడాది దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవలే ఈ విషయంపై విశాల్ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. విశాల్ మూవీ అనగానే అంతా కూడా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని అంతా భావించారు. కాని అనూహ్యంగా విశాల్ ఒక కుక్క పిల్లతో సినిమా తీస్తాడట. ఈ విషయాన్ని తమిళ మీడియాకు ఆయన సన్నిహితులు అనఫిషియల్ గా తెలియజేశారు.
కుక్క పిల్ల ప్రధాన పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో త్రిష ఉంటుందట. కుక్క పిల్ల చుట్టు కథ తిరుగుతూ ఉంటుందని సమాచారం అందుతుంది. పక్కా కమర్షియల్ చేస్తాడనుకుంటే విశాల్ ఇలాంటి సినిమా చేస్తానంటున్నాడేంటీ అంటూ ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాలను చేస్తేనే ప్రతిభ అనేది బయటకు వస్తుంది. అందుకే విశాల్ ఈ సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడేమో మరి..!