రెండేళ్ల కిందట తమిళ నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ అండ్ కో రేపిన ప్రకంపనల్ని ఇంకా ఎవరూ మరిచిపోలేదు. దశాబ్దాలుగా నడిగర్ సంఘంలో పాతుకుపోయి ఉన్న పెద్దోళ్లకు గట్టి షాకే ఇచ్చింది విశాల్ బృందం. మొత్తం అన్ని పదవుల్నీ గెలుచుకుని శరత్ కుమార్ వర్గానికి దిమ్మదిరిగే సమాధానం చెప్పింది. ఇప్పుడు అదే కోవలో తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనూ విశాల్ సంచలనం సృష్టించాడు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాలే విజయం సాధించాడు. ఆదివారం రాత్రి ఎన్నికల ఫలితాల్ని ప్రకటించారు.
మొత్తం 1212 ఓట్లలో 1059 ఓట్లు పోలవగా.. విశాల్ కు 478 ఓట్లు వచ్చాయి. విశాల్ సమీప ప్రత్యర్థి రాధాకృష్ణన్ 333 ఓట్లు తెచ్చుకున్నాడు. విశాల్ మరో ప్రత్యర్థి కేఆర్ 224 ఓట్లు దక్కించుకున్నాడు. గత ఏడాది కలైపులి థాను నేతృత్వంలోని నిర్మాతల మండలి మీద ధ్వజమెత్తడం ద్వారా విశాల్ కౌన్సిల్ ఎన్నికల రణరంగానికి తెరతీశాడు. పైరసీకి వ్యతిరేకంగా కౌన్సిల్ ఏమీ చేయకుండా భజ్జీలు బోండాలు తినేసి సమావేశాలు ముగిస్తోందని అతను చేసిన విమర్శలు సంచలనం సృష్టించాయి. దీంతో అతడిని నిర్మాతల మండలి నుంచి సస్పెండ్ చేశారు. అతను కోర్టులో పోరాడి గెలిచాడు. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్.. గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖుల్ని కలుపుకుని నిర్మాతల మండలి ఎన్నికల్లో దిగాడు. నడిగర్ సంఘంలో మాదిరే ఇక్కడా జయకేతనం ఎగురవేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/