చిన్న సిటీల్లోనూ డైనమైట్‌ దూకుడు

Update: 2015-08-30 15:56 GMT
దేవకట్టా కసిగా వస్తున్నాడు. డైనమైట్‌ పేల్చబోతున్నాడు. ఈసారి ఛాన్స్‌ విష్ణు. టీజర్‌ లో డైలాగులు ఇప్పటికే డైనమైట్‌ లా పేలుతున్నాయి. లోతు, ఘాడత ఉన్న డైలాగులు రాయాలంటే దేవకట్టా తర్వాతే. ప్రస్థానం తర్వాత మళ్లీ అంత పవర్‌ఫుల్‌ డైలాగులు డైనమైట్‌ లో వినిపిస్తున్నాయి. యుద్ధం అనే టాపిక్‌ చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతోందని టీజర్‌ లో చెప్పకనే చెప్పాడు.

హీరో విష్ణు లుక్‌ మార్చేసి పూర్తి యాక్షన్‌ మోడ్‌ లో కనిపిస్తున్నాడు. రౌడీ, అనుక్షణం తర్వాత మళ్లీ అంత షటిల్డ్‌ గా కనిపిస్తున్నాడు. కండరాలన్నీ ఉబ్బించి మరీ హీరోయిజాన్ని ఎలివేట్‌ చేస్తున్నాడు. అంతేకాదు.. ప్రమోషన్‌ లోనూ విష్ణు అండ్‌ గ్యాంగ్‌ డైనమిజం చూపిస్తున్నారు. చిన్న సిటీ, పెద్ద సిటీ అనే అంతరాలేవీ చూపించకుండా ప్రతిచోటా పబ్లిసిటీ ప్లాన్‌ చేస్తున్నారు. చోటా మోటా నగరాల్లోనూ ఈ డైనమైట్లు తిరిగొస్తున్నారు. వరంగల్‌, రాజమండ్రి లాంటి చిన్న సిటీల్లోనూ ప్రమోషన్‌ చేస్తూ మీకోసం మేం.. అంటూ ప్రజలకు దగ్గరవుతున్నారు.

ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హిట్టు కొట్టడమే లక్ష్యంగా అటు దేవా కట్టా, ఇటు విష్ణు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎర్రబస్సు తర్వాత విష్ణుకి, 'ఆటోనగర్‌ సూర్య' తర్వాత దేవాకి ఇది ఎంతో కీలకమైన సినిమా. అందుకే కసిగా ఇలా ముందుకెళ్తున్నారు. దెబ్బ తిన్నవాడిలోనే డైనమిజం ఉంటుందని ప్రూవ్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News