లేడీ బాండ్ నే త‌ల‌పిస్తున్న యాంక‌ర్ విష్ణుప్రియ‌

Update: 2021-05-15 03:30 GMT
కిల్ల‌ర్ లుక్ తో క‌ట్టి ప‌డేయ‌క‌పోతే ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డం క‌ష్ట‌మే. అందునా ఇప్పుడున్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ లో త‌మ‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కాలంటే సంథింగ్ ఇంకేదైనా చేయాలి. నేటిత‌రం యాంక‌ర్ల‌లో అన‌సూయ‌.. రేష్మి గౌత‌మ్ .. శ్రీ‌ముఖి లాంటి యాంక‌ర్లు ట్రెండ్ ని ప‌ట్టేయ‌డంలో ముందుంటారు.

ఇటీవ‌ల యాంక‌ర్ విష్ణు ప్రియ కూడా రేసులోకి వ‌చ్చారు. ఈ అమ్మ‌డు రెగ్యుల‌ర్ గా ఇన్ స్టా వేదిక‌గా వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తూ యూత్ కి మ‌త్తెక్కిస్తున్నారు. తాజాగా మ‌రో హాట్ ఫోటోషూట్ తో విష్ణు ప్రియ అభిమానుల ముందుకు వ‌చ్చారు. బ్లాక్ లెద‌ర్ జాకెట్ లో స్పెష‌ల్ డిజైన‌ర్ లుక్ తో విష్ణు ప్రియ భీమ‌నేని లేడీ బాండ్ నే త‌ల‌పిస్తోంది.

ఇత‌ర యాంక‌ర్ల‌తో పోటీప‌డుతూ ఈ భామ కూడా ప్ర‌స్తుతం వెండితెర అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని సమాచారం. ఆ క్ర‌మంలోనే ఇలా స్పెష‌ల్ గా ప్లాన్ చేస్తున్నార‌న్న‌మాట‌.  `పోరా పోవే` షోతో బాగా పాపుల‌రైన ఈ తెలుగు యాంక‌ర్ ఇంత‌కుముందు కొన్ని చిన్నా చిత‌కా సినిమాల్లోనూ న‌టించింది. యూత్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న యాంక‌ర‌మ్మ‌గా గుర్తింపు తెచ్చుకుంది.
Tags:    

Similar News