వీడియో : విశ్వక్‌ సేన్‌ దమ్కీ హుక్‌ స్టెప్‌ వైరల్‌

Update: 2022-12-10 10:33 GMT
విశ్వక్ సేన్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న దాస్ కా దమ్కీ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పాట ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆల్మోస్ట్‌ పడిపోయిందే పిల్లా అంటూ సాగే పాటకు మాస్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్‌ దక్కింది.

మంచి డాన్స్ మూమెంట్స్ కు ఛాన్స్ ఉన్న ఈ పాట యొక్క హుక్‌ స్టెప్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియా లో చాలా మంది ఈ హుక్ స్టెప్స్ ను వేస్తూ సినిమాను ప్రమోషన్ చేయడం లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

విశ్వక్ సేన్ హుక్ స్టెప్‌ తో మరోసారి అలరించాడు. విశ్వక్‌ సేన్ సోషల్‌ మీడియాలో ఈ హుక్ స్టెప్‌ ను రీ క్రియేట్‌ చేయాలి అంటూ అభిమానులకు మరియు ఫాలోవర్స్ తో షేర్ చేశాడు.

ఈ సినిమా కు నిర్మాత కూడా విశ్వక్‌ సేన్ అవ్వడంతో కాస్త ఎక్కువ రిస్క్‌ తీసుకుని భారీగా ఖర్చు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

హిట్‌ సినిమా తో పాటు ఆ తర్వాత చేసిన సినిమాలతో విశ్వక్ సేన్ క్రేజ్ మరింత పెరిగింది. అందుకే ఈ సినిమా పై ఆయన అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Video Here>> https://youtube.com/shorts/pbcTwBY_vto?feature=share
Tags:    

Similar News