తామొక హీరో అయినా సరే మరొక స్టార్ అభిమాని అని చెప్పుకోవడానికి ఏమాత్రం ఆలోచించరు యువ హీరోలు. అలాంటి వారిలో విశ్వక్ సేన్ ఒకరు. అతను యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కి వీరాభిమాని అని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా ఇష్టమని తన నటనలో ఆయన రిఫరెన్స్ ఉంటుందని అంటున్నారు విశ్వక్ సేన్. అంతేనా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎన్టీఆర్ ని వాడేస్తుంటాడు. రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఆ సినిమాలో కూడా ఎన్టీఆర్ రిఫరెన్స్ వాడేశాడు.
డైరక్టర్ ఐడియానా లేక ఇది తన ఆలోచనా అన్నది తెలియదు కానీ ఓరి దెవుడా సినిమాలో బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దదో వైపు అనే సాంగ్ రెండు సార్లు సినిమాలో వినిపిస్తుంది. ఒకసారి ఏకంగా ఎన్టీఆర్ వీడియోనే వేస్తారు.. మరోసారి ఆడియో వస్తుంది. మరొక సీన్ లో సాంగ్ హమ్మింగ్ చేసుకుంటూ అక్కడ కూడా ఎన్టీఆర్ నే తలచుకుంటాడు విశ్వక్. ఓరి దేవుడాలో ఈ సీన్స్ నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. ఎన్.టి.ఆర్ పై తనకున్న అవకాశాన్ని ఏ ఛాన్స్ వచ్చినా వదలకుండా చూపించేస్తున్నాడు విశ్వక్ సేన్.
ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో ఎన్.టి.ఆర్ ని మీ ఫంక్షన్ కి తీసుకురావొచ్చు కదా అని రిపోర్టర్ అడిగితే ట్రై చేసాను కానీ కుదరలేదు అని అన్నారు. ఎన్.టి.ఆర్ నటన అంటే చాలా ఇష్టమని ఎప్పటికప్పుడు ఫ్యాన్ బోయ్ గా మాట్లాడే విశ్వక్ సేన్ ఛాన్స్ వస్తే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటా అని అంటున్నాడు. యువ హీరోల్లో కొత్త కథలతో సినిమా సినిమాకు చాలా ప్రత్యేకత చూపిస్తున్న విశ్వక్ సేన్ రాబోయే రోజుల్లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళ సూపర్ హిట్ మూవీ ఓ మై కడవులే సినిమా తెలుగులో ఓరి దేవుడాగా వచ్చింది. మాత్రుక దర్శకుడు అశ్వత్ మారిముత్తునే తెలుగులో కూడా డైరెక్ట్ చేశారు. సినిమాలో విక్టరీ వెంకటేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. సినిమాలో వెంకటేష్ ఉండటం కూడా సినిమా సక్సెస్ కి కారణమని చెప్పొచ్చు. దీపావళి సందర్భంగా 3 రోజుల ముందే రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.