విశ్వక్ కమిట్మెంట్ అలాంటిది.. ఎమోషనల్ టచ్ చేసిన మాస్ కా దాస్..!

Update: 2022-10-23 03:35 GMT
దీపావళి సందర్భంగా ఓరి దేవుడా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. ఈమధ్యనే అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో హిట్ అందుకున్న ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో ప్రతి సినిమాకు డిఫరెంట్ కథలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తున్నాడు. ఈక్రమంలో తాజాగా వచ్చిన ఓరి దేవుడా సినిమా కూడా సక్సెస్ అందుకుంది. తమిళ సూపర్ హిట్ మూవీ ఓ మై కడవులే మూవీని తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. సినిమాలో విక్టరీ వెంకటేష్ నటించడం కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.

ఫ్రై డే రిలీజైన ఈ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు చిత్రయూనిట్. ఈ ప్రెస్ మీట్ లో విశ్వక్ ఎమోషనల్ అయ్యాడు. కెమెరా అందుకోగానే తనకు ఈ రేంజ్ లో సపోర్ట్ ఇస్తున్న ఆడియన్స్, మీడియాకు చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. కెరియర్ ఫస్ట్ టైం రిలీజ్ ముందు సినిమా చూడకుండా డైరెక్ట్ గా ఆడియన్స్ తో పాటే ఈ మూవీ చూశానని చెప్పారు విశ్వక్. ప్రేక్షకులతో కలిసి సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాకు లియోన్ మ్యూజిక్ వన్ ఆఫ్ ది మేజర్ హైలెట్ అని అన్నారు విశ్వక్. వెంకటేష్ గారు ఈ సినిమా చేయడం తన అదృష్టమని. సినిమాలో ఆయన వచ్చినప్పుడల్లా థియేటర్ లో సందడి కనిపిస్తుందని అన్నారు.   

మంచి సినిమాను మన ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని మరోసారి మీరు ప్రూవ్ చేశారు. సినిమా టీం అంతా కూడా ఒక వారం పదిరోజుల నుంచి ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ఈ టీం అందరిని తను చాలా మిస్ అవుతా అని అంటున్నాడు విశ్వక్. అంతేకాదు ఛాన్స్ ఉంటే ఈ టీం తో మళ్లీ పనిచేస్తానని చెప్పారు. ప్రమోషన్స్ బిజీ వల్ల సినిమా డబ్బింగ్ టైం లో తప్ప ఓరి దేవుడా మొత్తం సినిమా చూడలేదని.. ఆడియన్స్ తో కలిసి సినిమా చూస్తుంటే తాను కూడా చాలా ఎక్సయిట్ అయ్యానని అన్నారు విశ్వక్. మొత్తానికి యంగ్ హీరో ఖాతాలో మరో హిట్ సినిమా పడ్డది. ఈ మూవీ తర్వాత దాస్ కా దమ్కీ అంటూ మరోసారి తన మార్క్ మాస్ సినిమాతో వస్తున్నారు విశ్వక్ సేన్. ఆ మూవీని తనే డైరెక్ట్ చేస్తున్నారు.  
Tags:    

Similar News