జీవితంలో చీకటి రోజులు.. బాలయ్య షోలో యంగ్ హీరో భావోద్వేగం..!

Update: 2022-10-22 12:30 GMT
యంగ్ హీరో విశ్వేక్ సేన్ టాలీవుడ్లో ప్రామిసింగ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నటించింది కొన్ని సినిమాలే అయినప్పటికీ యూత్ లో విశ్వక్ సేక్ కు భారీ క్రేజ్ ఉంది.  ఫ‌ల‌క్‌నుమాదాస్', 'పాగల్', 'అశోకవనంలో అర్జున కల్యాణం' వంటి వరుస హిట్లతో విశ్వక్ సేన్ టాలీవుడ్లో తనకంటూ ఓ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు.  

ఈనెల 21న విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' మూవీ రిలీజైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో కలిసి బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ కు గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ తన జీవితంలో ఎదురైన చీకటి రోజులను చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తన తదుపరి చిత్రం 'దుమ్కీ' షూటింగ్ చేస్తున్న సమయంలోనే సినీ నిర్మాతలు సమ్మెకు పిలుపు నిచ్చారని తెలిపాడు. సుమారు నెలపాటు సమ్మె కొనసాగడంతో సినిమాపై ఎఫెక్ట్ పడిందన్నారు. 'దుమ్కీ' మూవీలో తాను నటించడంతోపాటు దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు చెప్పాడు.

నిర్మాతల సమ్మెతో 'దుమ్కీ' షూటింగ్ ఆలస్యం అవడంతో బడ్జెట్ అమాంతం పెరిగిందన్నారు. ఇదే సమయంలో తన సోదరి అస్వస్థతకు గురైందని వాపోయాడు. దీంతో ఆమెను ఐసీయూలో చేర్పించాల్సి వచ్చిందన్నాడు. సినిమా బడ్జెట్ పెరిగిపోవడం, సోదరి ఆస్పత్రిపాలు కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపాడు.

ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఆస్పత్రుల్లో గడుపాల్సి వచ్చిందని తెలిపాడు. ఉదయం షూటింగ్ , రాత్రుళ్లు ఆస్పత్రిలో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నాడు. అలాగే తమ తల్లిదండ్రులు తమ సోదరిని ఉదయం పూట చూసుకునే వారని తెలిపాడు. ఈ సమయంలో కేవలం మూడు గంటలే నిద్రపోయి తెల్లారి షూటింగులో పాల్గొనాల్సి వచ్చేదని వాపోయాడు.

షూటింగు లాక్ కావడం, సోదరి ఐసీయూలో ఉండటం వల్ల ఒక్కోసారి ఏడుపు వచ్చేదన్నాడు. ఇవే తన జీవితంలో 'చీకటి రోజులని' బాలయ్య షోలో విశ్వక్ సేక్  భావోద్వేగానికి గురయ్యాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News