'సైరా' కథ నాకు ఏడాది క్రితమే తెలుసు

Update: 2019-09-07 01:30 GMT
మాజీ ఎంపీ.. మెగా కోడలు ఉపాసన బాబాయి.. ప్రముఖ వ్యాపారవేత్త అయిన కొండా విశ్వేశ్వరరెడ్డి తాజాగా ఒక ఆన్‌ లైన్‌ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తనకు చిరంజీవితో ఉన్న అనుబంధం మరియు చరణ్‌ తనకు చెప్పిన సైరా విశేషాలను వెళ్లడించాడు. ప్రస్తుతం రాజకీయాలకు కాస్త దూరంగా ఉండి వ్యాపారాలపై దృష్టి పెట్టిన విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున గెలిచిన ఆయన 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం గురించి తనకు ముందే తెలుసన్నాడు. రామ్‌ చరణ్‌ ఏడాది క్రితమే నాకు ఆ సినిమా స్టోరీ చెప్పాడు. అయితే అప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అన్నాడు. కాని సినిమా సైరా నరసింహారెడ్డిగా తెరకెక్కించారు. సైరా చిత్రంను చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. చిరంజీవి గారితో ఎక్కువగా పరిచయం సన్నిహిత్యం లేదు. కాని ఆయనతో ఉన్న పరిచయం అనుభవం మేరకు ఆయన నాకు తెలిసి మంచి వ్యక్తి.. డౌన్‌ టు ఎర్త్‌ అనే పదానికి నిదర్శనంగా అనిపిస్తుంటారు. ఆయన రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా చాలా మంచి చేశారు. ఆయన సినిమా తప్పకుండా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు.

కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు ముఖ్యంగా మెగా అభిమానులు ఎన్నో కళ్లు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. చిరంజీవి 152వ చిత్రంగా రూపొందిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబర్‌ 2న విడుదల అవ్వబోతుంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ తో పాటు తమిళ.. కన్నడం.. మలయాళం స్టార్స్‌ నటించారు. కనుక దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై క్రేజ్‌ ఉంది. నయనతార హీరోయిన్‌ గా నటించగా తమన్నా మరియు నిహారికలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌ తో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు.

Tags:    

Similar News