150కి హ్యాండ్ ఇచ్చి అక్కడ తలూపాడు

Update: 2016-10-20 05:03 GMT
బాలీవుడ్ హీరోలు నెగిటివ్ రోల్స్ చేయడానికి పెద్దగా అబ్జెక్షన్స్ ఏమీ చెప్పరు. తమ ఫీల్డ్ లోనే లేని అభ్యంతరాలు సౌత్ నుంచి ఆఫర్స్ వచ్చినపుడు మాత్రం ఏముంటాయ్? పైగా.. మనోళ్లు పక్క భాషల నుంచి అంటే బాగా ముట్టచెప్పేందుకు సిద్ధంగా ఉంటారు కూడా. అందుకే సౌత్ సినిమాల్లో నార్త్ వాళ్లు విలన్ లుగా కనిపిస్తుంటారు.

ఇప్పటికే రజినీకాంత్ రోబో సీక్వెల్ 2.0లో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ను విలన్ గా నటింప చేస్తున్నారు. ఇప్పుడు వివేక్ ఒబేరాయ్ ను కూడా తీసుకొచ్చేశారు. కోలీవుడ్ స్టార్ అజిత్ 57 వ మూవీ(తల 57)లో వివేక్ ఒబేరాయ్ ని విలన్ గా ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని యూనిట్ అఫీషియల్ గానే అనౌన్స్ చేసింది. అయితే.. ఈ బాలీవుడ్ హీరోకు కొన్ని నెలల క్రితం టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వెళ్లింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి టైటిల్ ఖైదీ నెంబర్ 150గా డిసైడ్ చేయకముందే.. అంటే షూటింగ్ స్టార్ట్ అయిన తొలి నాళ్లలోనే.. విలన్ గా చేయమని వివేక్ ఒబేరాయ్ అడిగారు. కానీ చిరు సినిమాలో విలన్ గా చేసేందుకు రాని ఈ హీరో.. అజిత్ సినిమాకి మాత్రం సై అన్నాడు.  

ఇందుకు రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన డిఫరెన్సులే కారణం అనే టాక్ వినిపిస్తోంది.  అలాగని ఖైదీ నెంబర్ 150 నిర్మాత రామ్ చరణ్ ఏమీ తగ్గలేదు లెండి. అప్పట్లో చిరు పక్కన చూడాలని ఉందిలో హీరోయిన్ మెరిసిన అంజలా జవేరి ఉంది చూశారూ.. ఆమె భర్త తరుణ్ అరోరాను పట్టుకొచ్చాడు చెర్రీ. ఇక్కడ మిస్ అయ్యి.. కోలీవుడ్ లో వివేక్ ఒబేరాయ్ సినిమా చేసుకుంటుంటే.. హీరోని కాదని హీరోయిన్ భర్తను తెచ్చుకున్నారు మనోళ్లు. అలా జరిగిందన్న మాట విలన్ స్టోరీ.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News