తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ నిలిచాడు. సీరియల్ ఆర్టిస్టుగా పెద్దగా జనాల్లో క్రేజ్ లేకుండా హౌస్ లో అడుగు పెట్టిన సన్నీ మొదట్లో ఆయనపై ఏమాత్రం అంచనాలు లేవు. అయితే ఆయన వ్యవహారిక భాష మరియు ఆయన చూపించే ఎమోషన్స్.. ఆయన ఇతర కంటెస్టెంట్స్ పట్ల ఉండే కేరింగ్.. టాస్క్ ల్లో చూపించే తెగువ అన్ని కలిపి ఆయన్ను విజేత అయ్యేందుకు దోహద పడ్డాయి అనడంలో సందేహం లేదు. ఇవి మాత్రమే కాకుండా ఒకానొక సమయంలో సింపథీ కూడా ఆయనకు కలిసి వచ్చింది. కంటెస్టెంట్స్ చాలా మంది సన్నీని టార్గెట్ చేసినట్లుగా గేమ్ ఆడేవారు. పలు సందర్బాల్లో సన్నీని బ్యాడ్ చేయాలనే భావనతో గేమ్ ఆడారా అనిపించింది. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ సన్నీ ని ఎలాగైనా బ్యాడ్ చేయాలి.. బయటకు పంపించాలి అన్నట్లుగా చూశారు అనిపించింది. అదే విషయాన్ని సన్నీ కూడా విజేతగా అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో చెప్పాడు.
అరియాతో విజేతగా నిలిచిన తర్వాత ట్రోఫీ దక్కించుకున్న సన్నీ బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో పలు విషయాలను గురించి మాట్లాడాడు. పలు కెప్టెన్సీ టాస్క్ ల్లో నన్ను కొందరు టార్గెట్ చేసినట్లుగా ఆడేవారు. అందరు ఒక వైపు నేను ఒక వైపు అయ్యాను అన్నట్లుగా పలు సార్లు అనిపించింది. నాకు టాస్క్ ల్లో ఒకరు ఇద్దరు మద్దతుగా నిలిచినా కొందరు మాత్రం అస్సలు నేను గెలువకూడదు అనే ఉద్దేశ్యంతో ఆడేవారు. వారి ఆటకు నేను హెల్ప్ చేసినా కూడా వారు మాత్రం నా పట్ల వ్యతిరేకంగానే ఉండేవారు. ఎందుకో నేను అస్సలు నచ్చలేదు. వారికి నా పద్దతి నచ్చకనో లేదా మరేదో కారణం కాని ఎప్పుడు కూడా కాస్త దూరంగా ఉన్నట్లుగానే ఉండేవారు అన్నాడు.
ఇక మానస్ వంటి స్నేహితులు లభించడం లక్ గా చెప్పుకొచ్చాడు. పలు సందర్బాల్లో మానస్ నేను గొడవ పడ్డాం. కాని వెంటనే కలిసి పోయాం. నాకు చాలా సార్లు వెనుక ఉండి నడిపించాడు. కాజల్ కూడా నాకు మంచి స్నేహితురాలు. ఆమె స్నేహం మరువలేన్న అన్నట్లుగా కామెంట్స్ చేశాడు. ఇక సిరి మరియు షన్నుల మద్య ఉన్నది మంచి స్నేహం అన్నట్లుగా సన్నీ చెప్పుకొచ్చాడు. ఒకానొక సమయంలో మానస్ తో వారిద్దరి మద్య లవ్ ఉన్నట్లుగా మాట్లాడాడు. కాని జనాలకు తప్పుగా అర్థం అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో సిరి మరియు షన్ను లను వెనుక వేసుకు వచ్చినట్లుగా సన్నీ పలు సందర్బాల్లో మాట్లాడాడు. సిరి వాళ్ల అమ్మ హౌస్ లోకి వెళ్లిన సమయంలో మరియు స్టేజ్ మీదా ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో కూడా సిరి మరియు షన్నూలు మంచి స్నేహితులు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనను బ్యాడ్ చేయాలని చూసిన వారు బ్యాడ్ అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో సన్నీ చేస్తున్న కవరింగ్ కు అభిమానులు ముచ్చటేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.