ఫోటో స్టోరీ: వోగ్ కోసం కియారా వయ్యారం

Update: 2019-12-04 07:19 GMT
కొంతమంది భామల తీరే అంత. అలవోకగా హీరోయిన్ అవుతారు.  హిట్లు సాధిస్తారు.. ఫ్యాన్ ఫాలోయింగ్ సాధిస్తారు.. క్రేజ్ సాధిస్తారు.. ఇక సోషల్ మీడియాను ఎంతో సులువుగా ఆడుకుంటారు.  కియారా అద్వాని ఇప్పటికే ఇలాంటివన్నీ చేసేసింది. అంటే కియారా హార్డ్ వర్క్ చెయ్యలేదని కాదు.. హార్డ్ వర్క్ చేసినా కానీ చాలామందికి ఇలా సక్సెస్ చూడడం వీలుకాదు. అందుకే కియారా ఓ స్పెషల్ హీరోయిన్.

ప్రముఖ మ్యాగజైన్ల కు కూడా ఈ సంగతి తెలుసు. ఆ సంగతి తెలిసే వారి కవర్ పేజిలపై కియారా కు స్థానం ఇస్తారు. రీసెంట్ గా వోగ్ ఇండియా మ్యాగజైన్ వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ కియారా ఫోటో షూట్ చేశారు. డిసెంబర్ కవర్ పేజిపై మెరవడంతో పాటుగా కియారా భిన్నమైన దుస్తులలో ఈ ఫోటో షూట్ కోసం తన స్టైల్ ను రంగరించింది.  వోగ్ వారు పైన ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ "మిమ్మల్ని.. మీ ప్రతిభను నిజంగా నమ్మేవారు ఉండడం అనేది ఎంతో ప్రేరణనిస్తుంది.  డిసెంబర్ 2019 ఇష్యూ. కియారా అద్వాని" అంటూ క్యాప్షన్ ఇచ్చారు.  ఈ ఫోటోలో నలుపు-తెలుగు రంగులో పోల్కా డాట్స్ ఉండే స్లీవ్ లెస్ గౌన్ ధరించి రంగీలా టైపులలో ఒక పోజిచ్చింది. చెవులకు వెడల్పాటి రింగ్స్.. పెదవులకు దొండపండు లాంటి రంగు తగిలించి ఫేసుకు కాస్త మేకప్ ఎక్కువగానే దట్టించి ఓ చలాకీ చిరునవ్వు నవ్వింది.  

ఈ ఫోటోకు ఇంట్రెస్టింగ్ కామెంట్లు వచ్చాయి.  "పోల్కా డాట్ డ్రెస్ సూపర్".. "ఈషా డియోల్ లాగా ఉన్నావు".. "నిన్ను చూస్తే నాకు ఏదో అవుతుంది" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఒకరు మాత్రం ఏదో విప్లవ నేపథ్యం నుంచి వచ్చినట్టున్నారు.. "ఫ్యాషన్ అంటే బాలీవుడ్ ఒక్కటేనా.. భారతదేశం లో ఇంకెక్కడా లేదా.. వోగ్ మీరు ఎప్పుడు ఎదుగుతారు?  ఎంతో మంది రియల్ మోడల్స్ ఉన్నారు. వారిని వదిలేసి బాలీవుడ్ చూరు పట్టుకు వేలాడుతున్నారే.. సిగ్గు చేటు. ఛీ ఛీ" అంటూ దుమ్ము  దులిపాడు.  ఆ నెటిజన్ ఆవేశంలో అర్థం ఉందని అనిపిస్తోంది కదా?
Tags:    

Similar News