గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ పాజిటివ్ టాక్ తో పాటు కొంచెం డివైడ్ టాక్ కూడా తెచ్చుకుంది. ఐతే తొలి వారాంతంలో ఈ సినిమాకు వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.10.8 కోట్ల షేర్.. రూ.17.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. రామ్ కెరీర్లో తొలి వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గత ఏడాది వచ్చిన ‘నేను శైలజ’ కంటే ఇది మెరుగైన వసూళ్లే సాధించింది. ఐతే ఈ సినిమా ఇంకో పది కోట్ల దాకా షేర్ రాబడితేనే బయ్యర్లు సేఫ్ జోన్లోకి వస్తారు. కాబట్టి సోమవారం వసూళ్లు ఎలా ఉంటాయన్నది కీలకం. ఈ వారాంతంలో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజవుతున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజుల్లో ‘జిందగీ’ బాగానే రాబట్టాలి.
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ షేర్స్ వివరాలు..
నైజాం (తెలంగాణ)-రూ.3.8 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.14 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.1.4 కోట్లు
తూర్పు గోదావరి-రూ.64 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.47 లక్షలు
గుంటూరు-రూ.80 లక్షలు
కృష్ణా- రూ.67 లక్షలు
నెల్లూరు-రూ.28 లక్షలు
కర్ణాటక-రూ.63 లక్షలు
యుఎస్- రూ.67 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.30 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.9.2 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.14 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.10.8 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-రూ.17.4 కోట్లు
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘ఉన్నది ఒకటే జిందగీ’ షేర్స్ వివరాలు..
నైజాం (తెలంగాణ)-రూ.3.8 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.1.14 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.1.4 కోట్లు
తూర్పు గోదావరి-రూ.64 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.47 లక్షలు
గుంటూరు-రూ.80 లక్షలు
కృష్ణా- రూ.67 లక్షలు
నెల్లూరు-రూ.28 లక్షలు
కర్ణాటక-రూ.63 లక్షలు
యుఎస్- రూ.67 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.30 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.9.2 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.14 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.10.8 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-రూ.17.4 కోట్లు