జిందగీకి ఆ పది కోట్లు కష్టమే!!

Update: 2017-11-03 13:20 GMT
రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఉన్నది ఒకటే జిందగీ. ఈ చిత్రంపై ముందు నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. నేను శైలజ వంటి ఆకట్టుకునే మూవీని తెరకెక్కించిన దర్శకుడు కిషోర్ తిరుమల.. మరోసారి రామ్ తో జత కట్టడమే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. జనాల్లో ఈ సినిమాపై ఏ స్థాయి క్యూరియాసిటీ ఉందో.. తొలి వీకెండ్ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది.

అయితే.. వారాంతం తర్వాత మాత్రం కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి. టాక్ బాగోకపోవడంతో అసలు మళ్లీ కోలుకోవడం కూడా కష్టమే అనిపించకమానదు. నైజాంలో 4.8 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ.. వైజాగ్ నుంచి 1.49 కోట్లు.. ఈస్ట్ 78 లక్షలు.. వెస్ట్ 58 లక్షలు.. కృష్ణా 86 లక్షలు.. గుంటూరు 95 లక్షలు.. నెల్లూరు నుంచి 32 లక్షలు వసూలు చేయగలిగింది. కోస్తా జిల్లాల నుంచి మొత్తం 4.98 కోట్ల షేర్ రాగా.. సీడెడ్ లో 1.77 కోట్లు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.55 కోట్ల షేర్ వసూలైంది.

యూఎస్ తో పాటు ఇతర ప్రాంతాల కలెక్షన్స్ కలుపుకుంటే తొలివారంలో 13.4 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 22 కోట్లకు విక్రయించారు. అంటే కనీసం మరో 10 కోట్లు వస్తే కానీ సేఫ్ జోన్ లోకి వెళ్లే పరిస్థితి లేదు. తొలి వారంలో పూర్ గా పెర్ఫామ్ చేయడం.. ఈ వారం కొత్త సినిమాల రిలీజ్ లు ఎక్కువగా ఉండడంతో.. ఇకపై ఉన్నది ఒకటే జిందగీ కలెక్షన్స్ ఊపందుకోవడం కష్టమే అంటున్నారు ట్రేడ్ జనాలు.
Tags:    

Similar News