కొడాలి నాని నో చెప్పడం వల్లే 'ఆది' వచ్చాడు!

Update: 2022-07-21 03:30 GMT
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్‌ హిట్ స్టూడెంట్‌ నెం.1 కాగా... మొదటి మాస్ బ్లాక్ బస్టర్ మాత్రం ఆది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీనేజ్ కుర్రాడు తొడకొట్టి మాస్ ఆడియన్స్ ను అల్లాడించాడు. ఎన్టీఆర్‌ ను ఆ రేంజ్‌ లో వినాయక్‌ చూపించిన తీరుకు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయ్యారు. సీనియర్ హీరోలకు సైతం సాధ్యం కాని రికార్డులను ఆది తో కుర్రాడి గా ఎన్టీఆర్ దక్కించుకున్నాడు.

హీరోగా ఎన్టీఆర్‌ కెరీర్‌ ఈ స్థాయిలో ఉంది అంటే ఖచ్చితంగా అందులో ఆది పాత్ర ఉంటుంది. వి వి వినాయక్‌ దర్శకత్వంలో రూపొందిన ఆది సినిమా ను నల్లమలపు బుజ్జి నిర్మించగా మణిశర్మ సంగీతాన్ని అందించాడు. బెల్లంకొండ సురేష్ ఈ సినిమా ను సమర్పించాడు. ఎన్టీఆర్ స్టామినా కు ఈ స్టోరీ సాధ్యమా అనే విషయం పై అనుమానాలు లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమాకు ఓకే చెప్పారు.

ఆది సినిమా వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను తాజాగా దర్శకుడు వినాయక్‌ ఒక మీడియా ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వినాయక్‌ ఒక హీరోయిన్‌ ఓరియంటెడ్‌ లవ్ స్టోరీ సినిమా తో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం నల్లమలపు బుజ్జి ద్వారా ఎన్టీఆర్ ను సంప్రదించాడట. ఎన్టీఆర్ కు కథ నచ్చడంతో ఓకే అనేశాడట.

కొడాలి నాని ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఒక ప్రేమ కథలో నటించడం ఏంటీ... అయినా లేడీ ఓరియంటెడ్ సినిమా లో నటించడం ఎందుకు అన్నట్లుగా వినాయక్‌ సినిమాకు ఎన్టీఆర్ తో నో చెప్పించాడట. దాంతో వినాయక్‌ మరో అవకాశం ను ఇవ్వాల్సిందిగా ఎన్టీఆర్‌ ని కోరాడట. అప్పుడు ఆది స్క్రిప్ట్ ను రెడీ చేసుకుని ఎన్టీఆర్ వద్దకు వెళ్లాడు.

ఈసారి ఆది స్క్రిప్ట్‌ ప్రతి ఒక్కరిని మెప్పించింది. అలా ఎన్టీఆర్‌ ఆది సినిమాను చిన్న వయసులోనే చేశాడు. కొడాలి నాని ప్రేమ కథకు నో చెప్పి ఉండకుంటే ఆది సినిమా వచ్చేది కాదు. ఆయన ఆ రోజున ఎన్టీఆర్‌ యొక్క ఇమేజ్ ను దృష్టి లో ఉంచుకోవడం వల్లే ఆది సినిమా వచ్చిందని నందమూరి అభిమానులు అంటున్నారు.

అప్పుడు మాత్రమే కాకుండా కెరీర్‌ ఆరంభంలో కొడాలి నాని ఒక అన్న మాదిరిగా ఎన్టీఆర్‌ కు వెనుక ఉండి నడిపించాడు. పలు సినిమా ల్లో నిర్మాతగా కూడా భాగస్వామ్యం తీసుకుని ఎన్టీఆర్‌ కోసం కొడాలి నాని నిర్మాత అయ్యాడు. సినీ కెరీర్‌ లో అండగా ఉన్న కొడాలి నానికి రాజకీయంగా తనకు తోచిన సహాయం ను ఎన్టీఆర్ చేశారని అంటూ ఉంటారు. అందుకే ఇప్పటికి ఎన్టీఆర్‌ కు కొడాలి నానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు.
Tags:    

Similar News