ఇప్పటివరకు మహేష్ తో ఎన్ని సినిమాలు ఎవరు తీసినా కూడా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ మాత్రం ఎవ్వరూ తీయలేదు. అలాంటి ట్యాలెంట్ ఉన్న దర్శకుల్లో వివి వినాయక్, బోయపాటి శ్రీను మాత్రమే. మరి వీళ్ళతో మహేష్ సినిమా తీస్తాడా? ఈ విషయం గురించి ఓసారి వినాయక్ ను అడుగుదాం..
''మహేష్ కు త్వరలోనే ఒక కథ వినిపించనున్నా. అదెలా ఉంటుందంటే.. 100 కోట్ల బడ్జెట్ తో మహేష్ సినిమా.. ఆ రేంజులోనే సినిమా తీస్తాను. ఆయనతో త్వరలోనే కథను ఓకె చేయించుకొని మీకు చెబుతా..'' అంటూ సెలవిచ్చాడు వినయ్. మొత్తానికి మహేష్ కెరియర్‌లో అతిపెద్ద మాస్ మూవీ చేయనున్నాడని ఇక్కడే తెలుస్తోంది. కొంపతీసి నిజంగానే మహేష్ బాబుకు ఆల్రెడీ వినయ్ ఒక కథ చెప్పేసి ఓకె చేయించుకుని కూర్చున్నాడా? అఖిల్ సినిమా తరువాత ఈ సినిమా చేయనున్నాడా? శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ లో వినాయక్ కనిపించాడంటేనే ఈ విషయం అర్దమవుతోంది.