వారిని నిరాశకు గురిచేసిన VV వినాయక్

Update: 2018-07-18 08:29 GMT
డైరెక్టర్ VV వినాయక్ పుట్టిన ఊరు చాగల్లు అయినా పెరిగింది..చదువుకుంది అంతా రాజమండ్రే.  వినాయక్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ ఆయనకు సొంతూరు రాజమండ్రి లో ఎప్పటికైనా ఒక మల్టీప్లెక్స్ కట్టాలన్న కోరిక ఉంది.  గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన డ్రీమ్ గురించి మీడియా తో పంచుకున్నారు కూడా.

తనకు రాజమండ్రి లోని ప్రైమ్ లొకేషన్ అయిన హుకుంపేట దగ్గర 2.5 ఎకరాల స్థలం ఉంది. అక్కడే తన మల్టీప్లెక్స్ కట్టాలని అనుకున్నాడట. రాజమండ్రి వాసులు కూడా అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మల్టీప్లెక్స్ వస్తుందని.. అది నగరానికే ఒక ల్యాండ్ మార్క్ అవుతుందని ఆశ పడ్డారు.   కానీ వాళ్ళ ఆశలు తీరే అవకాశం ఇప్పటికైతే  లేనట్టే.  ఎందుకంటే ఆ స్థలాన్ని డీమార్ట్ రిటైల్ స్టోర్ వారు కొనుగోలు చేయడం జరిగిందట.  దీంతో ఆ స్థలం ల్యాండ్ మార్క్  అవుతుంది గానీ మల్టీప్లెక్స్ అయ్యే ఛాన్స్ మిస్ అయినట్టే.   సో.. త్వరలో అక్కడ జనాలకు సరసమైన ధరల్లో సరుకులు లభించే అవకాశం ఉందిగానీ మల్టీప్లెక్స్ సిల్వర్ స్క్రీన్ పై సినిమాలు చూసే అవకాశం లేదు.

రాజమండ్రి లో ఇప్పటి వరకూ ఒక్క మల్టీప్లెక్స్ కుడా లేదు... దీంతో వినాయక్ మల్టీప్లెక్స్ మిస్ కావడం ఆ ప్రాంత వాసులను కొంత నిరాశకు గురిచేసే విషయమే కానీ నగరంలో కొత్త మల్టీప్లెక్స్ ప్రాజెక్టులు ప్లానింగ్ దశలో ఉన్నాయనే వార్త వారికి కాస్త ఊరటనిచ్చేదే.  


Tags:    

Similar News