కమర్షియల్ మూవీస్ పై వినాయక్ క్లాస్

Update: 2017-02-06 07:18 GMT
టాలీవుడ్ సినిమాలపై బోలెడన్నివిమర్శలు వస్తుంటాయి. బయటి వ్యక్తుల కంటే.. ఇండస్ట్రీలోని జనాలే ఇలాంటి ప్రచారానికి ఒడిగడుతూ ఉంటారు. కొత్తదనాన్ని ప్రోత్సహించడం లేదని.. స్టార్ స్టేటస్ పేరుతో కమర్షియల్ సినిమాలు తీసుకుంటున్నారనే విమర్శలు బోలెడన్ని ఉంటాయి. రీసెంట్ గా ఖైదీ నంబర్ 150 మూవీతో ఇండస్ట్రీ హిట్ సాధించినా.. చిరంజీవి-వినాయక్ లపై ఇలాంటి విమర్శలు వచ్చాయి.

ఇలాంటివారందరికీ కలిపి ఒకేసారి క్లాస్ తీసుకున్నాడు దర్శకుడు వివి వినాయక్. తెలుగులో స్టార్ హీరోలను తక్కువ చేయడం సరికాదన్న ఈ దర్శకుడు.. డిఫరెంట్ సినిమాలు చేసి నష్టపోయిన వారిని ఎవరైనా ఆదుకుంటున్నారా అని నిలదీశాడు. చిరంజీవితో సినిమా అంటే.. కోట్ల రూపాయలు లాభం చేసుకునే రోజుల్లో.. నాగేంద్ర బాబు రుద్రవీణ చిత్రాన్ని తీసి నష్టపోయిన విషయాన్ని గుర్తు చేశాడు వినాయక్. ఆ తర్వాత నాగబాబు కోలుకునేందుకు చాలా కాలం పట్టిందని చెప్పాడు.

అలాగే షో అంటూ విభిన్నమైన చిత్రాన్ని తీసి నేషనల్ అవార్డ్ అందుకున్న నీలకంఠకు ఎవరైనా ఆఫర్స్ ఇస్తున్నారా అని అడిగాడు వినాయక్. కమర్షియల్ మూవీస్ తీసే దర్శకులు.. ఆర్ట్ సినిమాలు కూడా తీయగలరన్న ఈ మాస్ డైరెక్టర్.. ఆర్ట్ సినిమాలు మాత్రమే తీసేవాళ్లు కమర్షియల్ చిత్రాలు తీసి మెప్పించగలరా అని నిలదీశాడు. పక్క పరిశ్రమలతో పోల్చుకుంటూ మన ఇండస్ట్రీని మనమే తక్కువ చేసి చూపడం సరికాదంటూ వినాయక్ పీకిన క్లాస్.. చాలామందికే చురకలు వేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News