ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` ప్రీరిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో విజువల్ గ్రాండియర్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా హిస్టరీలో మునుపెన్నడూ ఎవరూ చేయలేనంత రిచ్ గా యువి సంస్థ ఈ వేడుకను నిర్వహించింది. నెవ్వర్ బిఫోర్ అన్నంతగా దాదాపు 2కోట్లు ఖర్చు పెట్టి `సాహో` స్టేజీని నిర్మించడం ఒకెత్తు అనుకుంటే ఆ సినిమా షూటింగ్ కోసం ఉపయోగించిన ఖరీదైన వాహనాల్ని డిస్ ప్లే పెట్టడం మరో హైలైట్ గా నిలిచింది. ఈ వేదికపై ప్రముఖుల వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఈ వేదిక ఆద్యంతం వక్తలు మాట్లాడుతూ సినిమా బడ్జెట్ గురించి.. యు.వి.క్రియేషన్స్ డేరింగ్ డెసిషన్స్ గురించి పొగిడేశారు. నిర్మాతల డేర్ గురించి పలువురు మాట్లాడుతూ.. పులులు- సింహాలకు మాత్రమే అలాంటి గుండె ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రభాస్ స్థాయి ఇండియా లెవల్.. జాతీయ స్థాయిని అందుకున్నాడు. ఇక అంతర్జాతీయ స్థాయిని అందుకోవాలని దీవించారు పెద్దలు. హాలీవుడ్ స్టాండార్డ్స్ లో సినిమా తెరకెక్కించిన సుజీత్ పైనా ప్రశంసల జల్లు కురిసింది. ఇక మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ .. ప్రభాస్ స్థాయిని.. హిందీ మార్కెట్లో సాహో రేంజును ఓ లెవల్లో పొగిడేశారు. ``ఇప్పటి వరకు హిందీ పరిశ్రమలో రూ.42కోట్లు షేర్ నంబర్ వన్ అంటున్నారు. సాహోకు రూ.50కోట్లు షేర్ వస్తుందని చెప్పుకుంటున్నారు. మన ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినందుకు సంతోషంగా ఉంది. అతడు తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాలి. 1000కోట్లు.. 2000 కోట్ల రూపాయల బడ్జెట్‌కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ప్రభాస్ ఆ స్థాయికి ఎదగాలి`` అని అన్నారు.
యువి.క్రియేషన్స్ అధినేతల గురించి మాట్లాడుతూ.. నిర్మాతలు వంశీ-ప్రమోద్- విక్కీలకు మనుషులకు ఉండే గుండె కాదు.. సింహాలు.. పులలకు ఉండే గుండె అయ్యి ఉంటుంది. అందరికీ భయం ఉంది కానీ.. వారికి మాత్రం భయం లేదు. అందుకు కారణం వారి వెనక ప్రభాస్ వెనకున్నాడనే ధైర్యం. ప్రభాస్‌ను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ఎక్కడికో తీసుకెళతారనే ధైర్యం. యువదర్శకుడు సుజిత్‌కి అంతా మంచి జరగాలి. బాహుబలి తర్వాత ఎలాగైతే రాజమౌళి గురించి ప్రపంచం అంతా మాట్లాడుకున్నారో.. సాహో తర్వాత సుజిత్ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకోవాలనుకుంటున్నాను`` అని అన్నారు. తెలుగు సినిమా స్థాయి అంతకంతకు పెరుగుతోంది.
వినాయక్ అన్నట్టుగానే మన సినిమాల బడ్జెట్ల స్థాయి 1000 కోట్లు లేదా 2000 కోట్లకు చేరడం కష్టంగా కనిపించడం లేదు. హాలీవుడ్ స్థాయి దిగ్గజాలతో టై అప్ లు పెట్టుకుని సినిమాలు తీసే కల్చర్ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో పలు కార్పొరెట్ దిగ్గజాలు దక్షిణాదిన వినోద రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండడంతో వినాయక్.. అల్లు అరవింద్ వంటి ప్రముఖుల మాటల్లో వాస్తవికత ధ్వనించింది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో `రామాయణం` చిత్రాన్ని నిర్మించేందుకు బాస్ అల్లు అరవింద్ సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే. అసాధ్యం అన్నది ఏదీ లేదు. సుసాధ్యం చేసే మనసుంటే!!