స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ సడెన్ గా రూటు మార్చి హీరో అవ్వడం పరిశ్రమ వర్గాలు సహా కామన్ జనాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. తనని నిర్మాతగా టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడిగా వినాయక్ పై అభిమానంతో దిల్ రాజు ఈ సినిమాని నిర్మించతలపెట్టారు. ఆ క్రమంలోనే ఎన్.నరసింహారావు దర్శకత్వంలో వినాయక్ హీరోగా `సీనయ్య` ప్రారంభమైంది. కొన్నాళ్ల పాటు షూటింగ్ జరిగింది.
అయితే సడెన్ గా ఏమైందో ఈ సినిమాని ఆపేశారన్న ప్రచారం హోరెత్తింది. దర్శకుడు నరసింహారావు తో వినాయక్ విభేధించడం వల్లనే షూటింగ్ ఆగిపోయిందని దిల్ రాజు కన్విన్స్ చేయలేకపోయారని ప్రచారమైంది. సోషల్ మీడియాలో దీనిపై బోలెడంత ప్రచారం సాగింది. ఆ తర్వాత కూడా ఈ వార్తలు నిజం కాదు అంటూ వినాయక్ ఫ్యాన్ వర్గం రివర్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. తదుపరి షెడ్యూల్ సెట్స్ కెళ్లనుంది అంటూ ప్రచారం సాగించింది.
అయినా అది నిజం కాదని తాజా సన్నివేశం చెబుతోంది. వినాయక్ ఇప్పుడు నటించే మూడ్ లో లేరట. తదుపరి మెగాస్టార్ చిరంజీవి హీరోగా లూసీఫర్ రీమేక్ ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారని దానికి సంబంధించి చరణ్ తో మంతనాలు సాగిస్తున్నారని ఓ గుసగుస ఇంతకుముందు వినిపించింది. పనిలో పనిగా హైదరాబాద్ కావూరి హిల్స్ లో ఆయన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించే ఆలోచనలో ఉన్నారని ప్రచారమవుతోంది. ఇకపోతే వినాయక్ పలుచోట్ల రియల్ వెంచర్ల ప్లాన్ చేశారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఎటూగాకుండా మధ్యలో ఉన్న సీనయ్య ఉన్నట్టా లేనట్టా? అంటే ఇక దిల్ రాజు సైతం ఆలోచన మార్చుకున్నారన్న టాక్ తాజాగా వినిపిస్తోంది. ఇటీవలే క్లాసిక్ టచ్ తో తీసిన జాను బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఫలితం మింగుడుపడని దిల్ రాజు సీనయ్య లాంటి ప్రయోగం చేసేందుకు వెనకాడేస్తున్నారట. ఇక విభేధాలు పొడచూపడంతో దానిని పరిష్కరించడం కష్టమైందన్న గుసగుసా వినిపిస్తోంది.