తెలుగు సినీపరిశ్రమకు అన్నివిధాలా ప్రోత్సాహకాలు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదని విమర్శలొచ్చాయి. సినీపరిశ్రమపై వైకాపా అధినాయకుడు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉక్కుపాదం మోపారని.. ఇండస్ట్రీని నలిపేస్తున్నారని కూడా విమర్శించినవారున్నారు.
అయితే తాజాగా `వాల్తేరు వీరయ్య` ప్రమోషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఏపీ ప్రభుత్వ తీరుతెన్నులపై చేసిన వ్యాఖ్యానం హాట్ డిబేట్ గా మారింది. టీఎస్ లో 6 షోలకు ఛాన్సిచ్చారు.. ఏపీలో అవకాశం ఉందా? అని ఓ 24 గంటల వార్తా చానెల్ యాంకర్ ప్రశ్నించగా.. దానికి చిరంజీవి యథావిథిగా డిప్లమాటిగ్గా జవాబిచ్చారు.
తెలంగాణలో 6 షోలకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. షోలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. నిర్మాతలు సంతోషంగా ఉన్నారు అని అన్నారు. అయినా రిలీజ్ వ్యవహారం నిర్మాతలు చూసుకుంటున్నారని మెగాస్టార్ తనదైన శైలిలో అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోకి సంతోషం. ఆంధ్రప్రదేశ్ లో కూడా టికెట్ పై రూ.25 పెంచుకునేందుకు వెసులుబాటు ఇచ్చినందుకు థాంక్స్. అదనపు షోలకు అనుమతులిచ్చారని విన్నాను. అవన్నీ నిర్మాతలే చూసుకుంటున్నారు. మా సినిమాని ప్రోత్సహించిన రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.
వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక వెన్యూ చివరి నిమిషంలో మార్చాల్సి వచ్చింది కదా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి కారణం కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ అని చిరంజీవి అన్నారు. నేనే సీఎంవోతో మాట్లాడాను. సీఎం గారితోను మాట్లాడాను. మీకు ఏది కావాలంటే దానికి సాయపడతాం. కావాల్సిన విధంగా ఉత్తర్వులు ఇస్తామని సీఎం ప్రామిస్ చేసారు.. అని తెలిపారు. వెన్యూ విషయంలో ప్రీరిలీజ్ వేడుకను ఎక్కడంటే అక్కడ చేసుకోవచ్చన్నారు. అయితే పోలీస్ వారితో మాట్లాడాక కొన్ని సమస్యలు ఉన్నాయని వివరించి చెప్పారు. పోలీసులు చెప్పిన అభ్యంతరాలు ఆమోదయోగ్యం అనిపించింది.
ఆదివారాల సమయంలో తీరంపైకి అలల తాకిడి అధికంగా ఉంటుంది. హైటైడ్ వల్ల నీరు చాలా ముందుకు వచ్చేసింది. సముద్రుడు అంచు వరకూ వచ్చేశాడు. దానికి తోడు వీకెండ్ కాబట్టి స్థానికులతో పాటు టూరిస్టులు ఎక్కువ వస్తారు. ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు తెలిపారు. అలాగే సీఎంవో నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇదివరకూ అనుకున్నట్టే ఏయులో చేసుకోండి అన్నారు. చివరి నిమిషంలో టైమ్ లేదు. యువి మేనేజ్ మెంట్ వాళ్లు యుద్ధ ప్రాతిపాదికన వేదికను రెడీ చేశారు. వేడుక సక్సెసైంది... అని తెలిపారు.
ఏపీలో సినిమాలు రాజకీయాలు క్లాష్ అవుతున్నట్టున్నాయి కదా? అని ప్రశ్నించగా.. నాకైతే అనిపించట్లేదు అని అన్నారు. రాజకీయాల్లో మీరు యాక్టివ్ గా లేరు పవన్ యాక్టివ్ గా ఉన్నారు. అది మీ సినిమాలను ఇబ్బంది పెడుతుందేమో? అని ప్రశ్నించగా అలాంటిదేమీ లేదు అని అన్నారు. అలా అనుకుంటే ఈ సినిమా(వాల్తేరు వీరయ్య)కి ఇబ్బంది రావాలి కదా...అలాంటిదేమీ లేదు.. అని అన్నారు.
బాలయ్య అన్ స్టాపబుల్ హోస్ట్ గా ఛాన్సిస్తే?
బాలకృష్ణ అన్ స్టాపబుల్ పై మీ అభిప్రాయం తెలపండి అని కోరా..
అన్ స్టాపబుల్ బావుంది.. జనాదరణ పొందింది అంటే అది బావుందని నిరూపణ అయినట్టు.. అని కితాబిచ్చారు. ఒకవేళ మిమ్మల్ని హోస్టింగ్ చేయమని `ఆహా` వాళ్లు అడిగితే చేస్తారా? అని ప్రశ్నించగా.. నన్ను ఇంకా అడగలేదు.. ఒకవేళ అడిగితే ఆలోచిస్తాను... అని అన్నారు.
ఇద్దరు హీరోల సినిమాలు పోటాపోటీగా వస్తున్నాయి. ఇబ్బంది లేదా? అని ప్రశ్నించగా.. ఒకే నిర్మాత కాబట్టి రెండూ బాగా ఆడాలి. దిల్ రాజు తమిళ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటాను. ప్రతి సినిమా ఆడాలి. ఇండస్ట్రీ బావుండాలి. అప్పుడే నిర్మాతలు సినిమాలు తీసి మాకు డబ్బులు ఇస్తారు... అని చిరంజీవి అన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.