ఫోటో స్టోరీ: రవివర్మ చిత్రమా..రసరమ్య మంత్రమా!

Update: 2020-05-25 14:54 GMT
వామిక గబ్బి తెలుసు కదా..  తెలుగులో ఒకటే సినిమాలో నటించింది. అదే 'భలే మంచిరోజు'.  ఇక తెలుగులో కాకుండా హిందీ.. పంజాబీ.. తమిళం.. మలయాళం సినిమాలలో నటించింది.  పంజాబీ అమ్మాయి కావడంతో బల్లె బల్లె అనుకుంటూనే కనీసం పది పంజాబీ సినిమాలు కవర్ చేసింది.  ఇక ఈ భామ సోషల్ మీడియా తోలు వొలచడం కూడా కఠిన సాధన చేస్తోంది.

ఆ సాధనలో భాగంగా ఒక బ్యాచ్ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.  ఈ ఫోటోలకు హిందీలలో కవితలను ఎడాపెడా రాసిపారేసింది. మరి అవన్నీ అనువాదం చేసుకుంటూ కూర్చుంటే గబ్బి పాప అందం గురించి కాకుండా ఆవిడ కవితల గురించి పేజీలకొద్ది చర్చించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కవితల గురించి మర్చిపోదాం.  ఇక ఫోటో విషయానికి వస్తే ఓ  డార్క్ చాకోలేట్ కలర్ చీర ధరించి ఎంతో సెన్సువల్ భంగిమలలో ఫోటోలు తీయించుకుంది. ఈ ఫోటోలు చూస్తుంటే అలనాటి రవివర్మ మరోసారి వచ్చి పెయింటింగ్ వేసినట్టు కనిపిస్తోంది.

వామిక అందం లైటింగ్ తో డబల్ అయినట్టు కనిపిస్తోంది.  ఇలాంటి భంగిమలను చూస్తే ఎలాంటి ఎంత పెద్ద గొంతుతో 'నో పెళ్లి' అని పాడుకుంటూ తిరిగే సింగిల్ ఉద్యమకారులైనా మింగిల్ అయ్యే ఆలోచన చెయ్యకమానరు. పెళ్లి మీద వ్యతిరేకతను పక్కన పెట్టకమానరు. ఎందుకంటే ఆ ఆ..కర్షణ అలాంటిది!
Tags:    

Similar News