తన కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నిఖిల్. హీరోయిన్ల దగ్గర్నుంచి ఇతర క్యాస్టింగ్ వరకు అన్నీ పక్కాగా ఉండేలా చూసుకుంటున్నాడు. అందుకే తాప్సి - కేథరిన్ లాంటి హీరోయిన్లు ఓకే చెప్పినా వాళ్లిద్దరినీ కాదని తనకు తగ్గట్టుగా ఉండే లేత భామల్ని ఎంపిక చేసుకొన్నాడు. టైగర్ ఫేమ్ వి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న నిఖిల్ కొత్త చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్లకి చోటుంది. ఇప్పటికే అవికాతోపాటు, హెబ్బా పటేల్‌ని ఎంపికచేసుకొన్నారు. తాజాగా మూడో కథానాయిక కూడా ఓకే అయ్యింది. కీలకమైన ఆ పాత్ర కోసం భలే మంచి రోజు హీరోయిన్ వామికాని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన భలే మంచి రోజు చిత్రంలో వామిక తన అందంతో అదరగొట్టింది. చీరకట్టుతో కనిపించి మెప్పించింది. ఆమె నటనలో ఎనర్జీ లెవల్స్ కూడా చాలా బాగున్నాయి. అది నచ్చే నిఖిల్ వామికని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలవ్వబోతోంది. శంకరాభరణంతో ఫ్లాప్ ని చవిచూసిన నిఖిల్ ఈసారి మాత్రం గన్ షాట్ గా హిట్టు కొట్టాల్సిందే అని కంకణం కట్టుకొని రంగంలోకి దిగుతున్నాడు.