సమీర్ వాంఖడే.. ఈ ఎన్సీబీ అధికారి ఇప్పుడు మహారాష్ట్రలోని ముంబైలో డ్రగ్స్ మూలాలు తవ్వితీస్తూ బాలీవుడ్ ను షేక్ చేస్తున్నారు. మొన్నటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం.. నిన్నటి షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఈ మత్తు రాయుళ్లకు సింహస్వప్నంలా సమీర్ వాంఖడే మారిపోయాడు. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే అతడిపై 25 కోట్ల లంచం డిమాండ్ చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఇవంతా ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నాడు.
ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ గా ఉన్న సమీర్ వాంఖడే పై ఇటీవల మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సైతం తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం ఆర్యన్ కు బెయిల్ దొరక్కుండా చేస్తున్న సమీర్ గతంలో షారుఖ్ కు కూడా చుక్కలు చూపించారు. పదేళ్ల క్రితం ముంబై ఎయిర్ పోర్టులో షారుఖ్ ను నాలుగు గంటల పాటు ఆపేశారు. 2010లో హాలెండ్, లండన్ లలో విహారయాత్ర ముగించుకొని ముంబై ఎయిర్ పోర్టులో షారుఖ్ ఖాన్ దిగారు. తనతోపాటు 20 బ్యాగ్ లను తీసుకొచ్చాడు. ఆ బ్యాగుల్లో విదేశీ వస్తువులను దేశంలోకి తీసుకువస్తున్నారని తెలిసి షారుఖ్ ను ఇదే సమీర్ వాంఖడే కస్టమ్స్ అధికారిగా ఉండగా విమానాశ్రయంలోనే ఆపేశారు. నాలుగు గంటల పాటు విచారించి 1.5 లక్షల రూపాయల పన్ను విధించి మరీ బయటకు పంపించారు.
షారుఖ్ ఖాన్ ను మాత్రమే కాదు.. ఇతర సెలబ్రెటీలకు కూడా సమీర్ గతంలో చుక్కలు చూపించారు.విలువైన బంగారు నగలు కలిగి ఉందనే కారణంతో అనుష్క శెట్టిని గతంలో సమీర్ విమానాశ్రయంలోనే దాదాపు 11 గంటలపాటు నిలిపివేసి విచారణ చేశారు.
ఇక వీరే కాదు.. దీపికా పడుకొనే, కత్రినా కైఫ్, మనీషా లాంబా, రణ్ బీర్ కపూర్, మికా సింగ్, బిపాసా బసు, వివేక్ ఒబెరాయ్, అనురాగ్ కశ్యప్, రియా చక్రవర్తిని కూడా గతంలో వివిధ కేసుల్లో సమీర్ వాంఖడే విచారించి ఇబ్బందులు పెట్టాడు. మొత్తంగా సెలబ్రెటీల పాలిట సమీర్ సింహస్వప్నంలా మారిపోయారు.