#సుశాంత్‌.. మాజీ ప్రియురాళ్లు ఇదేం కొట్లాట‌?

Update: 2020-08-29 12:10 GMT
సుశాంత్ సింగ్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తిపై సీబీఐ విచార‌ణ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ గురువారం దాదాపు 9 గంట‌ల పాటు సీబీఐ విచార‌ణ‌తోనే గ‌డిచిపోయింది. ఆ త‌ర్వాతా విచార‌ణ సాగించేందుకు సీబీఐ సిద్ధ‌మైంది. ఇదిలా ఉండ‌గానే ప‌లు మీడియా చానెళ్ల‌తో కంగ‌న ర‌నౌత్ స‌హా సుశాంత్ మాజీ ప్రేయ‌సి అంకిత లోఖండే చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారంగా మారాయి.

2016 వ‌ర‌కూ సుశాంత్ కి ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని మాన‌సిక నిపుణుల్ని క‌ల‌వ‌లేద‌ని అంకిత లోఖండే చెబుతోంది. సుశాంత్ కి మాద‌క ద్ర‌వ్యాల సేవ‌నం అల‌వాటు ఉంద‌న్న రియా వ్యాఖ్య‌ల్ని ఖండించింది. దీంతో చిర్రెత్తిపోయిన రియా నేరుగా అంకిత‌నే టార్గెట్ చేస్తోంది. సుశాంత్ త‌న‌కు రియా వ‌ల్ల ఎదురైన‌ వేధింపుల విష‌య‌మై కంగ‌న‌తో చెప్పుకుని బాధ‌ప‌డ్డాడ‌ని కూడా అంకిత లోఖండే వ్యాఖ్యానించ‌డంతో ఇక రియా ఊరుకుంటుందా?

వేరొక‌రితో నిశ్చితార్థం చేసుకుని ఇంకా సుశాంత్ ముందు విధ‌వ‌రాలిలా ప్ర‌వ‌ర్తిస్తోందని.. సుశాంత్ తో బ్రేక‌ప్ అయ్యాక అత‌డి ఫ్రెండుతో డేటింగ్ చేసింద‌ని గ‌ట్టిగానే కౌంట‌ర్ ఎటాక్ అందుకుంది. మొత్తానికి రియా వ‌ర్సెస్ అంకిత వివాదం ముదురుతోంది. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా మాట‌ల దాడి పెరిగింది. మునుముందు ఇది ఏ విల‌యానికి దారి తీయ‌నుందో?
Tags:    

Similar News