నైజాం లో గత కొంత కాలంగా డిస్ట్రిబ్యూషన్ రంగంలో దిల్ రాజు దే ఆదిపత్యం. అయితే ఆ ఆదిపత్యానికి బ్రేక్ వేయాలని, కొత్తగా నైజాం ఏరియా అంటే దిల్ రాజు మాత్రమే కాదని మరొకరు కూడా వున్నారని నిరూపించాలనే ఆయనతో గత కొంత కాలంగా పోటీపతున్నాడు వరంగల్ శ్రీను. హుషారు, కబాలి, ఇస్మార్ట్ శంకర్, గద్దరొండ గణేష్, సుల్తాన్, క్రాక్ వంటి సినిమాలతో నైజాంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. అయితే గత కొన్ని నెలలుగా ఆయన నైజాం ఏరియాలో రిలీజ్ చేస్తున్న ప్రయత్నాలేవవీ ఆశించిన స్థాయాలో ఆకట్టుకోవడం లేదు.
దాంతో భారీగా నష్టాలని చవిచూస్తున్నారు. ఇదిలా వుంటే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అనిపించుకున్న విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదలై అనూహ్యంగా డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీతో వరంగల్ శ్రీను భారీ స్థాయిలో నష్టపోయాడు. ఈ మూవీని భారీ మొత్తానికి నైజాం హక్కుల్ని వరంగల్ శ్రీను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మూవీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మౌనం వహిస్తున్న ఆయన మొత్తానికి పెదవి విప్పారు. 'లైగర్' డిజాస్టర్ పై సంచలన కామెంట్ లు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 'లైగర్' వల్ల తాను 65 శాతం నష్టపోయానని, సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని విజయ్ దేవరకొండ భావించాడని, అయితే రిజల్ట్ తరువాత విజయ్ చాలా నిరుత్సాహానికి, నిరాశకు గురయ్యాడని స్పష్టం చేశారు. దర్శక నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని కొంత మంది బాయ్ కాట్ ట్రెండ్ చేస్తున్నారన్నారు.
బాయ్ కాట్ ట్రెండ్ తో 'లైగర్' మూవీ విధ్వంసానికి గురైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 'లైగర్' ఫ్లాప్ వెనక పెద్ద కుట్ర జరిగిందన్నాడు. అంతే కాకుండా సోషల్ మీడియా వేదకగా సినిమాల ఫలితాలని నిర్ణయించి ప్రేక్షకులని తప్పుదారి పట్టిస్తున్నారని విస్మయాన్ని కలిగిస్తోందన్నాడు.
అంతే కాకుండా కొంత మంది సినిమాలు చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని వాపోయాడు. సినిమా రిలీజ్ కు ముందే విజయ్ దేవరకొండ ప్రెస్ మీట్ లో వ్యవహరించిన దాంట్లో కొంత అతి వుందని అంగీకరించిన వరంగల్ శ్రీను 'లైగర్' తరు నచ్చిందన్నాడు.
క్లైమాక్స్ మినహా సినిమా మొత్తం బాగుందని, కావాలనే బాయ్ కాట్ నిరాదంతో సినిమాని కిల్ చేశారని విమర్శలు చేశాడు. అయితే వరంగల్ శ్రీను మాటలు విన్న వాళ్లంతా ఫెయిల్యూర్స్ నుంచి తను ఇప్పటికీ నేర్చుకోలేదనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే ఇప్పటి వరకు సినిమాల వల్ల వరంగల్ శ్రీను దాదాపు రూ. 100 కోట్లు నష్టపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.