B-C కేంద్రాల్లో ఇస్మార్ట్ క‌లెక్ష‌న్ల‌తో వారియ‌ర్

Update: 2022-07-15 01:11 GMT
ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన 'ఇస్మార్ట్ శంక‌ర్' బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. పూరి తెర‌కెక్కించిన ఈ చిత్రం మాస్ ని రిపీటెడ్ గా థియేట‌ర్ల‌కు ర‌ప్పించింది. ఓపెనింగులు అద్భుతంగా వ‌చ్చాయి.

ఇప్పుడు రామ్ హీరోగా మాస్ యాక్ష‌న్ క‌థాంశంతోనే తెర‌కెక్కిన 'వారియ‌ర్' పై క్రిటిక్స్ లో మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర‌హాలోనే బి-సి కేంద్రాల్లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధిస్తోంద‌ని రిపోర్ట్ అందింది. తొలిరోజు అద్భుత ఓపెనింగులు సాధించిన ఈ చిత్రం తొలి వీకెండ్ కూడా ఈ స్పీడ్ ని కొన‌సాగిస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

వారియ‌ర్ కి లింగుస్వామి ద‌ర్శ‌కుడు. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టించింది. మాస్ కి కావాల్సిన యాక్ష‌న్.. రొమాన్స్ ఎలిమెంట్స్ .. రామ్ న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయ‌న్న టాక్ వచ్చింది.

టాక్ తో సంబంధం లేకుండా ఆరంభ వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంటున్న ఈ సినిమా బి- సి కేంద్రాల నుంచి రిపీటెడ్ ఆడియెన్ ని ర‌ప్పించ‌గ‌లిగితే చక్క‌ని విజ‌యం ద‌క్కించుకునే ఛాన్సుంది.

రామ్ త‌దుప‌రి మాస్ యాక్ష‌న్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో సినిమాకి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. హ‌రీష్ శంక‌ర్ తోనూ ఓ సినిమాకి కమిట‌య్యారు. దీనిపై మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.
Tags:    

Similar News