'వార‌సుడు' ఫ‌స్ట్ ఆప్ష‌న్ విజ‌య్ కాదా?

Update: 2022-12-16 23:30 GMT
ఇక క్రేజీ స్టార్ రిజెక్ట్ చేసిన స్టోరీలు మ‌రో స్టార్ ద‌గ్గ‌రికి వెళ్ల‌డం సినీ ఇండ‌స్ట్రీలో మామూలే. ఒక‌రితో చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేయ‌డం.. స‌ద‌రు హీరోల‌కు ఆ క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం.. లేదంటే డేట్స్ స‌మ‌స్య త‌లెత్త‌డం.. అనే కార‌ణాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు 'ఖైదీ' నుంచి 'జ‌న‌గ‌ణ‌మ‌న‌' వ‌ర‌కు ఎన్నో క‌థ‌లు చేతులు మారాయి. ఇప్ప‌టికీ మారుతూనే వున్నాయి. అలా 'వార‌సుడు' క‌థ కూడా ముగ్గురు క్రేజీ టాలీవుడ్ హీరోల చేతులు మారాకే త‌మిళ హీరో విజ‌య్ వ‌ద్ద‌కు చేరిందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'వారీసు'. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ స‌ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగులో 'వార‌సుడు' పేరుతో రిలీజ్ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకేసారి 2023 జ‌న‌వ‌రి 12న సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు భారీ స్థాయిలో థియేట‌ర్ల‌ని బ్లాక్ చ‌,ఏశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా త‌మిళ‌నాడులో ఈ యూవీని 400 పై చిలుకు థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌ని, అజిత్ 'తునీవు'ని కూడా బీట్ చేయాల‌ని దిల్ రాజు మ‌రిన్ని థియేట‌ర్ల కోసం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ప‌లు టీవీ ఛాన‌ల్స్ తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన దిల్ రాజు 'వారీసు' మూవీ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించి షాకిచ్చారు.

'వారీసు' ఫ‌స్ట్ ఛాయిస్ విజ‌య్ కాద‌ని ఈ మూవీ స్టోరీని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి రాసుకున్నాడ‌ని స్ప‌ష్టం చేశాడు. అయితే త‌ను మ‌రో ప్రాజెక్ట్ లో లాక్ అయి వుండ‌టంతో ఇదే స్టోరీని రామ్ చ‌ర‌ణ్ తో చేయాల‌నుకున్నామ‌న్నారు.

అయితే రామ్ చ‌ర‌ణ్ కూడా బిజీగా వుండ‌టం. డేట్స్ స‌ర్దుబాటు చేయ‌క‌పోవ‌డంతో అల్లు అర్జున్‌, ప్ర‌భాస్ ల వ‌ర‌కు వెళ్లామ‌న్నారు. అయితే వీరిద్ద‌రు కూడా బిజీగా వుండ‌టంతో ఫైన‌ల్ గా హీరో విజ‌య్ కి చెప్ప‌డం. ఆయ‌న ఓకే చేయ‌డం జ‌రిగింద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు దిల్ రాజు.

ఓ బిజినెస్ టైకూన్ స్టోరీగా ఈ మూవీని తెర‌కెక్కించాం అని తెలిపారు. విజ‌య్ కి త‌మిళ‌నాట వున్న క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌డంతో ఇప్పుడిది త‌మిళ‌నాట‌, తెలుగులోనూ క్రేజీ ప్రాజెక్ట్ గా మారి సంక్రాంతి బ‌రిలో తెలుగు సినిమాల‌కే గ‌ట్టి పోటీని ఇవ్వబోతుండ‌టం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News