పద్మాలయ స్టూడియో గేటు దగ్గర కృష్ణని వాచ్ మెన్ ఎందుకు ఆపేశాడు..?

Update: 2022-11-17 05:46 GMT
కృష్ణ గారి గురించి అందరు ప్రత్యేకంగా చెప్పుకునే లక్షణం ఆయన మృదు స్వభావం. అవతల ఉన్నది ఎవరైనా సరే ఆవేశం, కోపం ప్రదర్శించరు. ఒకసారి తన పద్మాలయ స్టూడియో దగ్గర వాచ్ మెన్ తనని ఆపినా సరే అతని సిన్సియారిటీ మెచ్చుకున్నారే తప్ప ఆయన్ని ఏమి అనలేదు.

ఇంతకీ అసలేం జరిగింది అంటే తిరుపతికి వెళ్లి తలనీలాలు ఇచ్చి వచ్చిన కృష్ణ ఇంటి దగ్గర నుంచి పద్మాలయ స్టూడియోకు సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా స్టూడియో దగ్గరకు చేరుకుంటున్న టైం లొ కారు ఆగిపోయింది. కారుని అక్కడే వదిలేసి దగ్గరకే కదా అని స్టూడియోకి నడుచుకుంటూ వెళ్లారు.  

ఆ టైం లో గేటు దగ్గర ఉన్న వాచ్ మెన్ కృష్ణని ఎప్పుడూ చూడని కారణంగా ఆయన ఎవరో అనుకుని స్టూడియో లోపలికి కృష్ణని పంపించడానికి నిరాకరించాడు. ఆ వాచ్ మెన్ కి తెలుగు రాకపోవడం వల్ల గేటు దగ్గర అలానే ఉన్నారట. అయితే కొద్దిసేపటికి స్టూడియో మేనేజర్ వచ్చి కృష్ణని లోపలికి తీసుకెళ్లారట. వాచ్ మెన్ చేసిన పనికి సాధారణంగా ఎవరైనా కోప్పడతారు కానీ కృష్ణ ఆయన సిన్సియారిటీ అభినందించారట. ఇలాంటివి కృష్ణ గారి జీవితంలో ఎన్నో ఉన్నాయి.    

తానొక పెద్ద హీరో అయినంత మాత్రాన అందరికీ తెలియాలన్న రూల్ ఏమి లేదని తనని గుర్తించవారి మీద తన కోపాన్ని ప్రదర్శించకుండా సైలెంట్ గా ఉంటారట కృష్ణ. సినిమా మీద ఆయనకున్న ప్యాషన్ తోనే కెరీర్ స్టార్టింగ్ నుంచే అద్భుతమైన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అందుకే ఆయన్ని అందరు సాహస వీరుడు అంటుంటారు.

ఒకానొక దశలో ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ సినిమాల కన్నా కృష్ణ సినిమా ఓపెనింగ్స్ భారీ రేంజ్ లో ఉండేవి. ఆ ఇద్దరి తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్.. మాస్ కలక్షన్స్ రాబట్టింది కృష్ణ మాత్రమే.  

అందుకే ఆయన మీద ఇప్పటికీ చెరిగిపోని కొన్ని రికార్డులు ఉన్నాయి. కృష్ణ వెళ్లిపొవడం వల్ల మహేష్ మీద మరింత బాధ్యత పెరిగింది. కృష్ణ గారి దారిలోనే మహేష్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రాలో రెండు ఊర్లని దత్తత తీసుకున్న మహేష్ చిన్నారుల హార్ట్ ఆపరేషన్ కి తన సాయం అందిస్తున్నారు. కృష్ణ వారసత్వాన్ని సినిమాల్లోనే కాదు సమాజ సేవలో కూడా కొనసాగిస్తున్నారు  మహేష్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News