ఆప్తుడిని కోల్పోయాం : నంద‌మూరి బాల‌కృష్ణ‌

Update: 2022-04-01 09:30 GMT
ప్ర‌ముఖ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ క‌న్ను మూశారు. గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌న శుక్ర‌వారం తుది శ్వాస విడిచారు. శ‌నివారం ఆయ‌న అంత్య‌క్రియ‌లు మ‌హా ప్ర‌స్థానంలో నిర్వ‌హించ‌నున్నామ‌ని కుటుంబ స‌భ్యులు వెల్ల‌డించారు. 'డియ‌ర్‌' అనే న‌వ‌ల ఆధారంగా స‌మ‌న్ హ‌రీఓగా 'చాద‌స్త‌పు మొగుడు' అనే సినిమాతో శ‌ర‌త్ ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. ఆ త‌రువాత ఇండ‌స్ట్రీలో వున్న ప్ర‌ముఖ హీరోల‌తో వ‌రుస‌గా సినిమాలు తెర‌కెక్కించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 20 చిత్రాల‌ని రూపొందించారాయ‌న‌. ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ త‌న కెరీర్ లో అత్య‌ధికంగా నంద‌మూరి బాల‌కృష్ణ‌, సుమ‌న్ ల‌తో సినిమాలు చేశారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో వంశానికొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్‌, వంశోద్ధార‌కుడు వంటి చిత్రాలు అందించారు.

ఇక సుమ‌న్ తో చాద‌స్త‌పు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ బావ‌మ‌రిది, చిన్న‌ల్లుడు వంటి చిత్రాల్ని రూపొందించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతో  'కాలేజీ బుల్లోడు', జాగ‌ప‌తిబాబుతో 'భ‌లే బుల్లోడు' వంటి చిత్రాలు చేశారు.  

కాగా ద‌ర్శ‌కుడు శ‌ర‌త్ మ‌ర‌ణంతో ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. ఆయ‌న మ‌ర‌ణం ప‌ట్ల ప‌లువురు ఇండ‌స్ట్రీ పెద్ద‌లు, హీరోలు తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. హీరో బాల‌కృష్ణ ఈ సంద‌ర్భంగా శ‌ర‌త్ మృతితో మంచి ఆప్తుడిని కోల్పోయాం అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 'ఆయ‌న నాకు మంచి ఆప్తుడు. ప‌రిశ్ర‌మ‌లో మంచి మ‌నిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న‌తో నేను వంశానికొక్క‌డు, పెద్ద‌న్న‌య్య‌, సుల్తాన్‌, వంశోద్ధార‌కుడు వంటి చిత్రాలు చేశాను.

ఈ రోజు ఆయ‌న మ‌ర‌ణ వార్త న‌న్ను బాధించింది. మంచి మ‌నిషి, నిస్వార్థ‌ప‌రుడు, ఆప్తుడిని కోల్పోయాం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియ‌జేస్తున్నాను' అన్నారు బాల‌కృష్ణ‌.

ఇటీవ‌ల 'అఖండ‌' చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకున్న బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో ఓ మాస్ మ‌సాలా యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని చేస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.
Tags:    

Similar News