తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన నిన్నటితరం హీరోయిన్స్ లో రాధిక ఒకరు. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు .. చిరంజీవి వంటి స్టార్స్ సరసన కథానాయికగా ఆమె అలరించింది. ఇటు అమాయక పాత్రలను .. అటు తెగించిన పాత్రలను పోషించడంలో రాధిక శభాష్ అనిపించుకున్నారు. 'స్వాతిముత్యం' .. 'స్వాతికిరణం' వంటి సినిమాలు, రాధిక నటనా పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఇప్పటికీ ఆనాటి ప్రేక్షకులు ఆమెను మరిచిపోలేదు.
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో రాధిక మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. రాధిక మాట్లాడుతూ .. "నేను పుట్టి పెరిగింది చెన్నైలోనే. అయితే కొంతకాలం పాటు శ్రీలంకలో హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. ఆ తరువాత కొంత కాలం పాటు లండన్ లో చదువుకున్నాను. మా ఫాదర్ ను చూడడానికి నేను లండన్ నుంచి వచ్చినప్పుడు, భారతీరాజా గారు నన్ను తన సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ సంఘటన చాలా తమాషాగా జరిగింది.
మేము లండన్ నుంచి వచ్చి చెన్నైలోని ఒక ఏరియాలో ఇల్లు అద్దెకి తీసుకున్నాము. అంతకుముందు ఆ ఏరియాలో ఆ ఇంట్లోనే మర్డర్ జరిగిందనే విషయం మాకు తెలియదు. ఆ విషయం తెలియక పోవడం వల్లనే సరిగ్గా ఆ ఇంట్లోనే రెంట్ కి దిగాము.
ఆ తరువాత ఆ సంగతి తెలియగానే కంగారు పడిపోయాము. సాధ్యమైనంత త్వరగా ఆ ఇంటిని ఖాళీ చేసేసి వెళ్లిపోవాలనే నిర్ణయానికి వచ్చేశాము. అదే సమయంలో నా స్నేహితురాలి ఆల్బమ్ లో నా ఫొటోను చూసిన భారతీరాజాగారు, తన సినిమా కోసం అడగడానికి మా ఇంటికి వచ్చారు.
భారతీరాజాగారు నాకు తెలియదు .. నేను అంతకుముందు ఆయనను చూడలేదు. చూడటానికి ఆయన చాలా నల్లగా .. గిరజాల జుట్టుతో ఉన్నారు. ఆయనను చూడగానే నేను భయపడిపోయాను .. ఎవరో హంతకుడే వస్తున్నాడనుకుని కంగారు పడిపోయాను. 'లోపలికి రావొద్దు .. లోపలికి రావొద్దు .. బయటికి వెళ్లండి' అని నేను గట్టిగా అరవడం మొదలుపెట్టాను.
ఆ కేకలు వినేసి మా మదర్ బయటికి వచ్చింది. ఆమెకి భారతీరాజా తెలుసు .. అందువలన చూడగానే గుర్తుపట్టేసింది. నన్ను అక్కడి నుంచి వెళ్లమంటూ .. ఆయనను లోపలికి ఆహ్వానించడం జరిగింది. ఆయన దర్శకత్వంలోనే తమిళంలో ఫస్టు మూవీ చేశాను" అని చెప్పుకొచ్చారు.