నీరవ్ మోదీ పాత్రలో ఒక పెద్ద స్టార్

Update: 2021-09-19 01:30 GMT
కుంభకోణాలు, తప్పించుకోవడాలపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. దేశాన్ని కుదుపు కుదిపిన బ్యాంకింగ్ మోసాలపై మాత్రం ఇప్పటిదాకా పెద్దగా సినిమాలు రాలేదు. ఇప్పుడు తీసే పనిలో పడ్డారు. ‘సర్కారివారి పాట’లో ఇదే కాన్సెప్ట్ తో మహేష్ బాబు రూపొందిస్తున్నారట.. ఇక తాజాగా ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘నెట్ ఫ్లిక్స్ ’లో సైతం తాజాగా ఈ బ్యాంకింగ్ మోసాలపై వెబ్ సిరీస్ రూపొందుతోంది.  

నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల ప్రసారమైన  హిట్ షో ‘బాడ్ బాయ్ బిలియనీర్స్‌’లో భారత్ లో బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త నీరవ్ మోడీపై ఒక కార్యక్రమం ప్రసారమైంది. దీనిని చాలా మంది వీక్షించారు. అది పాపులర్ అయ్యింది. దీంతో ఇప్పుడు నీరవ్ మోదీపై  వివరణాత్మక వెబ్ సిరీస్ రూపొందించడానికి రెడీ అయ్యారు. కాబట్టి అతడి గురించి అన్ని విషయాలు అందరికీ అర్థమయ్యేలా చూపించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 షెర్ని, శకుంతలా దేవి, ‘టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కథ’, ఎయిర్‌లిఫ్ట్ -బ్రీత్ అండ్ బ్రీత్: ఇన్‌టూ ది షాడోస్ వంటి ఒరిజినల్ సీరియల్స్ చేసిన అబుందంతియా ఎంటర్‌టైన్‌మెంట్ జర్నలిస్ట్ పవన్ సి లాల్ రచించిన “దోషం: ది రైజ్”, ఫాల్ ఆఫ్ ఇండియా డైమండ్ మొగుల్ నిరవ్ మోడీ ”ల ఆధారంగా ఈ వెబ్ సిరీస్  రూపొందిస్తారు.

ఈ సిరీస్‌లో నీరవ్ మోడీ పాత్రలో నటించడానికి ఒక పెద్ద బాలీవుడ్ స్టార్‌ని సంప్రదించారనే మాట కూడా వినిపిస్తోంది. త్వరలో ప్రకటన వెలువడుతుంది. షూటింగ్ 2022 మొదట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News