సాయి ధరమ్‌తేజ్ హీరోగా దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం `రిపబ్లిక్`. భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ సమకాలీన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయాలనే నేపథ్యంలో తెరకెక్కింది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకొచ్చిన దర్శకుడు దేవా కట్టా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా మాజీ ముఖ్య మంత్రులు.. స్నేహితులైన ఎన్. చంద్రబాబు నాయుడు.. వైఎస్. రాజశేఖర రెడ్డి జీవిత కథల ఆధారంగా వెబ్ సిరీస్‌ని తెరకెక్కించాలని వుందని వెల్లడించారు. కథ ఈ ఇద్దరి కాలేజీ జీవితం నుంచి మొదలవుతుందని తెలిపారు. గతంలో ఇదే ప్రాజెక్ట్ పై సంచలన ప్రకటన చేసిన దేవా కట్టా ఆ తరువాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ ని అందించలేదు. తాజాగా మరోసారి ఈ ఇద్దరు నాయకుల కథ ఆధారంగా తాను సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా ప్రకటించారు.
ఇప్పటికే ఈ ఇద్దరికి సంబంధించిన స్క్రిప్ట్ ని పూర్తి చేశానని.. రెండు సినిమాలుగా లేదా వెబ్ సిరీస్ లుగా దీన్ని తెరపైకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. ఈ ఇద్దరి కథకు నటీనటుల ఎంపిక చాలా ముఖ్యమైనదని.. వీరిపై సినిమా కానీ.. వెబ్ సిరీస్ కానీ తీస్తే అదొక సెలబ్రేషన్ లా వుండాలని.. అందు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని దేవా కట్టా తెలిపారు. నా దగ్గర వున్న ఈ స్క్రిప్ట్ గురించి ఇండస్ట్రీలో వున్న ఆల్ టాప్ హీరోస్ కి తెలుసునని ఈ సందర్భంగా వెల్లడించారు.
లెజెండ్ ఎన్టీఆర్ పొలిటికల్ కథ ఆధారంగా `చదరంగం` అనే వెబ్ సిరీస్ రూపొందింది. తాజాగా తాను సిద్ధం చేసిన కథని వెబ్ సిరీస్ గా తెరపైకి తీసుకొస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని దేవా కట్టా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.