కాదేదీ కవితకు అనర్హం అన్నట్టు ఇప్పడు కాదేదీ కమర్షియల్ కి అనర్హం అంటున్నారు సెలబ్రిటీలు. ప్రతీ విషయాన్ని కమర్షియల్ యాంగిల్ లోనే చూస్తూ డబ్బే ప్రధానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఓటీటీలు వచ్చాక కొత్త సంప్రదాయం వెలుగులోకి వచ్చేసింది. బిగ్ బాస్ షో కూడా నాన్ స్టాప్ ఓటీటీ వెర్షన్ అంటూ నెట్టింట హల్ చల్ చేసింది. ఇక థియేటర్లు పూర్తి స్తాయిలో తెరుచుకోకపోవడంతో చాలా వరకు స్టార్ హీరోలు తమ సినిమాలని ఓటీటీకే ఇచ్చేసి థియేట్రికల్ రిలీజ్ కి బ్రేక్ ఇచ్చేశారు.
ఇప్పడు పెళ్లిళ్లు, ప్రైవేట్ ఫంక్షన్ లు కూడా ఓటీటీలకు అమ్మేస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. పెళ్లిని కూడా కమర్షయలైజ్ చేసేసి దాన్ని ఓ ఈవెంట్ గా మార్చి ఓటీటీలకు కోట్ల రూపాయలకు అమ్మేస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారు. బాలీవుడ్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌషల్ ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమ వివాహ వేడుకని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కు 4 కోట్లకు అమ్మేయడం గమనార్హం. వీళ్లతో పెళ్లిని కూడా కమర్షియల్ చేయొచ్చనే ఆలోచన సెలబ్రిటీలలో మొదలైంది.
వీళ్ల పెళ్లి ఓటీటీ రైట్స్ డీల్ ని గమనించిన తరువాత అలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వెడ్డింగ్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ ప్రయత్నించిందని, భారీ స్థాయిలో ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆఫర్ చేశారని వార్తలు వినిపించాయి. అయితే ఎంత మంది ఎన్ని రకాలుగా ఆఫర్లు ఇచ్చినా అలియాభట్, రణ్ బీర్ కపూర్ ల వెడ్డింగ్ కు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ఇవ్వకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే ప్రతీ సెలబ్రిటీ చిన్న ఈవెంట్ ని కూడా అంటులో క్రేజీ స్టార్ లు పాల్గొంటే ఓటీటీ లకు భారీ మొత్తాల్ని డిమాండ్ చేస్తూ స్ట్రీమింగ్ కి ఇచ్చేస్తుండటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజాగా ఈ జాబితాలోకి లేడీ సూపర్ స్టార్ నయనతార, విఘ్నేష్ శివన్ ల వెడ్డిండ్ కూడా చేరిపోయింది. గత కొంత కాలంగా నయనతార, విఘ్నేష్ శివన్ ప్రేమలో వున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని వరుస కథనాలు వినిపిస్తూ వచ్చాయి. పెళ్లి గురించి వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నా ఈ జంట ఈ వార్తల పై స్పందించడానికి ఇష్టపడలేదు. వార్తలు పుట్టి కొట్టుంటాయి అవే సద్దుమనుగుతుంటాయంటూ సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయారు. ట్టకేలకు పెళ్లిపై స్పందించారు.
జూన్ 9న వీరి వివాహం అట్టహాసంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పెళ్లికి వీఐపీలు, స్టార్లు అధకంగా వచ్చే అవకాశం వుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇరు కుటుంబాల కు సంబంధించి సభ్యులు, సన్ని హితులతో పాటు కోలీవుడ్ , టాలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారట. ఇదిలా వుంటే అంగరంగ వైభవంగా జరగనున్న ఈ క్రేజీ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ఓ ప్రముఖ ఓటీటీకి అమ్మేశారని ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ జంట కత్రినా కైష్, విక్కీ కౌషల్ తనహాలోనే ఈ కోలీవుడ్ క్రేజీ కపుల్ తమ వెడ్డింగ్ కు సంబందించిన వీడియో స్ట్రీమింగ్ హక్కుల్ని భారీ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ కి అందజేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎంటైర్ వెడ్డింగ్ ని డాక్యుమెంటరీ స్టైల్ లో రికార్డ్ చేసి స్ట్రీమింగ్ చేయనున్నారట. అయితే ఇది ఎంత వరకు నిజమన్నది తెలియాల్సి వుంది. అంతే కాకుండా నయనతార, విఘ్నేష్ శివన్ వెడ్డింగ్ ని ఓ పేరున్న దర్శకుడి పర్యవేక్షణలో చిత్రీకరించబోతున్నారని, కోలీవుడ్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఈ విసయం తెలిసిన వాళ్లంతా పెళ్లిని కూడా కమర్షయిల్ చేసి ఓటీటీలకు అమ్మేస్తున్నారని సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారట.