దేవ కట్టా దర్శకత్వంలో సాయితేజ్ హీరోగా 'రిపబ్లిక్ సినిమా నిర్మితమైంది. నిన్న రాత్రి జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి మాట్లాడాడు. "ఈ రోజున ఈ ఈవెంట్లో ఇక్కడ నా తమ్ముడు తేజ్ ను నేను మిస్సవుతున్నాను. తేజ్ అనుకున్నట్టుగానే ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదలవుతోంది .. అందుకు కారణం ఆయన సంకల్ప బలం. మీరంతా కొట్టే చప్పట్ల వలన .. మేమున్నాం అంటూ మీరంతా ఇచ్చే భరోసా వలన తేజ్ మరింత త్వరగా కోలుకుంటాడు. 'సీటీమార్' నుంచి థియేటర్లకు జనం వస్తున్నారు .. మేమున్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నారు.
నిన్న విడుదలైన 'లవ్ స్టోరీ'కి కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు ఇస్తున్న భరోసా వలన మరింత కష్టపడటానికి చాలామంది సిద్ధమవుతున్నారు. ప్రతివారం థియేటర్లకి సినిమాలు తీసుకురావడానికి ఉత్సాహంతో ఉన్నారు. 'ప్రతిరోజు పండగే' సినిమా సమయంలో ఊళ్లు తిరుగుతున్నప్పుడు నేను గమనించాను. చిరూ ఫ్యాన్స్ .. పవన్ ఫ్యాన్స్ తేజ్ కి ఎంతో అండగా నిలబడ్డారు. అంతే సపోర్టును ఈ సినిమాకి కూడా ఇస్తారని నేను భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. "తేజ్ ఎప్పుడూ కూడా నన్ను నోరారా 'హరీశ్ అన్నా' అనే పిలిచేవాడు. తేజ్ వరుసకు పవన్ కి మేనల్లుడే అయినా వాళ్లిద్దరిది తండ్రి కొడుకుల రిలేషన్ అనిపిస్తుంది. ఆ విషయంలో తేజ్ చాలా అదృష్టవంతుడు. తేజ్ కి ప్రమాదం జరిగినప్పుడు అందరి హీరోల అభిమానులు కూడా తేజ్ ఫాస్టుగా కోలుకోవాలని మెసేజ్ లు పెట్టారు. గుళ్లలో .. చర్చిల్లో .. మశీదుల్లో పూజలు .. ప్రార్ధనలు చేశారు. నిజంగా అది నాకు చాలా ఆనందంగా అనిపించింది.
థియేటర్ అనేది కేవలం ఒక సినిమాను మాత్రమే కాదు .. ఎన్నో అనుభూతులను ఇస్తుంది. అలాంటి థియేటర్లు మళ్లీ ఓపెన్ కావడం .. మళ్లీ జనాలు వస్తుండటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. తేజ్ కోలుకుని హాస్పిటల్ నుంచి వచ్చేసరికి మనమంతా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ చేసి వెల్ కమ్ చెప్పాలి. దేవ కట్టా సినిమాల్లో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక స్పృహ కూడా ఉంటుంది. సిస్టంలో ఉంటూనే సిస్టంను ప్రశ్నించవచ్చనే విషయాన్ని ఆయన చెప్పిన తీరు నచ్చింది" అని చెప్పుకొచ్చాడు.