టాలీవుడ్‌లో తమ వద్ద వర్క్ చేసిన అసిస్టెంట్ లని దర్శకులుగా నిలబెట్టడంలో కొంత మంది స్టార్ డైరెక్టర్ లు గత కొంత కాలంగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తమ వద్ద వర్క్ చేసి పని నేర్చుకున్నారని వదిలేయడం లేదు. తమ శిష్యుల్నిదర్శకులుగా నిలబెట్టే బాధ్యతల్ని కూడా భుజానికెత్తుకుంటున్నారు. ఆ యా ప్రాజెక్ట్ లలో నిర్మాణ భాగస్వాములుగా కూడా మారి తమ శిష్యులకు అండగా నిలుస్తూ వారి కెరీర్ లకు బంగారు బాట వేస్తున్నారు. ఎంతో కాలంగా తమతో కలిసి నడిచిన శిష్యులకు అన్నీ తామై ముందు నిలుస్తున్నారు.
గతంలో దాసరి నారాయణారావు, కె. రాఘవేంద్రరావు, సాగర్ వంటి పలు దర్శకులు మాత్రమే తమ వద్ద వర్క్ చేసిన అసిస్టెంట్ లని దర్శకులుగా ప్రమోట్ చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పడు అదే పంథాలో తమ వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అసిస్టెంట్స్ ని దర్శకులుగా పరిచయం చేస్తూ అది తమ బాధ్యతగా భావిస్తున్నారు వి.వి.వినాయక్, సుకుమార్. ఇందులో వి.వి.వినాయక్ తన వద్ద డైరెక్షన్ టీమ్ పని చేసిన వారి కోసం పలువురు నిర్మాతలకు ఫోన్ లు చేసి మరీ రికమెండ్ చేస్తున్నాడు.
అయితే స్టార్ డైరెక్టర్ సుకుమార్ మాత్రం ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లి తన వద్ద డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేసిన వారిని దర్శకులుగా పరిచయం చేసే పనిలో వున్నారు. కొంత మంది శిష్యుల్ని దర్శకులుగా పరిచయం చేస్తూనే ఇప్పటికే దర్శకులుగా పరిచయం అయిన వారిని డైరెక్టర్లుగా నిలబెట్టే పని కూడా చేస్తున్నారు. ఇప్పటికే 'కరెంట్' మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన పల్నాటి సూర్య ప్రతాప్ ని 'కుమారి 21 ఎఫ్'తో వార్తల్లో నిలిచేలా చేసిన సుకుమార్ ప్రస్తుతం అతన్ని మెయిన్ స్ట్రీమ్ డైరెక్టర్ల జాబితాలోకి తీసుకురాబోతున్నారు.
ఇందు కోసం తను కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తూ '18 పేజెస్' మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ మూవీకి జీఏ2 పిక్చర్స్ వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా వ్యవహరించింది.
వన్ నేనొక్కడినే, రంగస్థలం, పుష్ప సినిమాలకు కథా రచనలో పల్నాటి సూర్య ప్రతాప్ .. సుకుమార్ కు సహకారం అందించాడు కూడా. అలాంటి తనని దర్శకుడిగా నిలబెట్టాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. '18 పేజెస్' సక్సెస్ అయితే సుకుమార్ అనుకున్నట్టే దర్శకుడిగా నిలబడే అవకాశం వుంది.
ఇదే తరహాలో మరో శిష్యుడు బుచ్చిబాబు సానని కూడా 'ఉప్పెన'తో దర్శకుడిగా పరిచయం చేసిన సుకుమార్ రెండవ సినిమాకు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తూ రామ్ చరణ్ తో ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం విశేషం. ఇలా ఇతర దర్శకులతో పోలిస్తే తన అసిస్టెంట్ లని తన ఇంటి సభ్యులుగా భావిస్తూ వారిని దర్శకులుగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు సుకుమార్. ఇది గమనించిన ఇండస్ట్రీ వర్గాలు భళా లెక్కల మాస్టారూ భళా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.