గాలి త‌న‌యుడి ఎంట్రీ అదిరిందిగా

Update: 2022-03-04 08:50 GMT
క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాలు సృష్టించిన సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గాలి జ‌నార్థ‌న్ రెడ్డి త‌న‌యుడు కిరీటి హీరోగా తెరంగేట్రం చేస్తున్నారు. ఈ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని శుక్ర‌వారం బెంగ‌ళూరులో లాంఛ‌నంగా ప్రారంభించారు. అత్యంత గ్రాండ్ గా జ‌రిగిన ఈ మూవీ ప్రారంభోత్స‌వానికి స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి ముఖ్య అతిథిగా హాజ‌రై పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీకరించిన ముహూర్త స‌న్నివేశానికి  క్లాప్ కొట్టారు.  

అట్ట‌హాసంగా నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మంలో ఫిల్మ్‌ సెల‌బ్రిటీల‌తో పాటు కర్ణాట‌క‌కు చెందిన పాపుల‌ర్ పొలిటీషియ‌న్స్ చాలా మంది పాల్గొన్నారు. అత్యంత బారీ బ‌డ్జెట్ తో గాలీ జనార్థ‌న్ రెడ్డి వార‌సుడు కిరీటి ఈ మూవీతో ప‌రిచ‌యం కాబోతున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా కిరీటి ఇంట్ర‌డ‌క్ష‌న్ కి సంబంధించిన గ్లింప్స్‌ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు.  

ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియో చాలా ఇంప్రెసీవ్ గా వుంది. హీరో కిరీటి రోడ్ పై స్కేటింగ్ చేస్తూ వెళుతూ ఓ పాప‌ని కాపాడే స‌న్నివేశాల్ని చాలా స్టైలిష్ గా చూపించారు. ఎంట్రీ వీడియోలో కిరీటి న‌టించిన తీరు అనుభ‌వం వున్న క‌మ‌ర్షియ‌ల్ హీరోలా వుంద‌ని అప్పుడే కామెంట్ లు వినిపిస్తున్నాయి. చిన్న పాప‌ని కాపాడుతూ లైఫ్ రిస్క్ చేసిన హీరో గాల్లో తేలుతూ అదిరిపోయే టైమింగ్ తో ఓ లేడీకి గులాబీని అందించిన తీరు కూడా హైలైట్ గా నిలిచింది.  

అత్యంత భారీ స్థాయిలో క‌మ‌ర్షియ‌ల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కిరీటికి జోడీగా `పెళ్లి సంద‌D` ఫేమ్ శ్రీ‌లీల న‌టించ‌నుంది. అంతే కాకుండా `బొమ్మ‌రిల్లు` హాసిని జెనీలియా ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తూ ఈ మూవీ ద్వారా రీఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. అంతే కాకుండా క‌న్న‌డ క్రేజీ స్టార్ డా. వి. ర‌వి చంద్ర కూడా కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి  శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం, స్టంట్స్ పీట‌ర్ హెయిన్‌, కెమెరా బాహుబ‌లి ఫేమ్  కె. సెంథిల్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌ ర‌వీంద‌ర్ .

Full View





Tags:    

Similar News