సినిమా థియేటర్ కు వెళితే ప్రేక్షకుడికి గుండు గీయించి పంపించేైస్తున్నారు. అంతలా దోచేైస్తున్నారని సోషల్ మీడియాలో ఓ సెటైర్ ఉంది. ఒక కుటుంబం సినిమాకు వెళ్లాలంటే రూ.1000 కావాల్సిందే. ఇక స్నాక్స్ కు అదనంగా రూ.500 చెల్లించాలి. టికెట్ తో సమానంగా స్నాక్స్ ధరలు ఉంటాయి. బైక్ పార్కింగ్ అదనం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబం థియేటర్ కు వెళితే ఎంత లేదన్నా రూ.2వేలు జేబులో పెట్టుకొని వెళ్లాల్సిందే. అంత ఖర్చు అవసరమా? అని ప్రేక్షకులు థియేటర్ కు వెళ్లడం మానేశారు. నెల తర్వాత ఓటీటీలో వస్తుందని తెలిసి ఇంట్లోనే ఆగి చూసేస్తున్నారు.
ఈ పరిణామంతో థియేటర్ పరిశ్రమ కుదేలైంది. రేట్లు పెంచుకొని లాభం పడుదామని నిర్మాతలు అనుకుంటే అసలా రేట్లకు సినిమాలే చూడమని ప్రేక్షకులు ముఖం చాటేశారు. దీంతో సినీ పరిశ్రమ ఇప్పుడు ఊబిలో పడిపోయింది. ఆదాయం రాకపోవడంతో నిర్మాతలు సినిమా షూటింగ్ లు బంద్ చేసిన పరిస్థితి నెలకొంది.
సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రేక్షకులు థియేటర్ కు రారని.. ఓటీటీల్లోనే చూస్తారని నిర్మాతలు చెబుతున్నారు. అయితే టికెట్ రేట్ల కంటే స్నాక్స్,పార్కింగ్ కే ఎక్కువ ఖర్చవుతుందని వాస్తవం మరిచిపోతున్నారు.
ఆంధ్రాలో సినిమా టికెట్ రేట్ల దోపిడీ విచ్చలవిడిగా సాగింది. పెద్ద సినిమా అయిన ఆర్ఆర్ఆర్ విడుదల తొలిరోజు దోచుకున్న వాడికి దోచుకున్నంతగా సాగిందనే ఆరోపణలున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వేళ అమ్ముకున్న వాడికి అమ్ముకున్నంత అన్నట్టుగా ఉందట..బెనిఫిట్ షోలు అని చెప్పి.. ఫ్యాన్స్ షోలు అని చెప్పి ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్ లు అమ్మేసుకున్నారు. ఎక్కడిక్కడ ఎవరి లెవల్ లో వారు టికెట్ ల మీద సంపాదించే పనిలో పడ్డారు.
విజయవాడలోని ఓ మాల్ లో అయితే మరీ దారుణంగా ఆర్ఆర్ఆర్ టికెట్ కావాలంటే ఫుడ్ ప్యాకేజీ తీసుకున్నారు. టికెట్ ఖరీదు రూ.800 గా నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో అసలు టికెట్ రేటు 236 కాగా.. ఆ టికెట్ కు ఫుడ్ కూపన్ జతచేసి అమ్మేసుకున్నారు. దీని మొత్తం విలువ 550 గా నిర్ణయించి దోచుకున్నారు.. కోక్, పాప్ కార్న్ కూడా అంటగట్టారట.. ఈ థియేటర్ కు వైసీపీ నేతలతో సంబంధాలున్నాయన్న టాక్ రావడంతో దాంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేకపోయారట..
ప్రస్తుతం కూడా థియేటర్ లో ధరల మోత మోగుతోంది. ఫ్యామిలీతో థియేటర్ కు వెళ్లిన కుటుంబానికి పాప్ కార్న్ రూ.300, కూల్ డ్రింక్స్ రూ.200, వాటర్ బాటిల్స్ రూ.60, సమోసాలు రూ.100, పార్కింగ్ రూ.20 ఇలా తడిసిమోపడవుతోంది. వీటి ధరల నియంత్రణను పట్టించుకోరా? అని సామాన్యులు మొత్తుకుంటున్నారు.
ఎంత సేపు సినిమా టికెట్ ధరలు, సినిమా నిర్మాణ వ్యయం గురించే మాట్లాడుతున్న సినీ ప్రముఖులు.. అసలు ప్రేక్షకులు ఎందుకు థియేటర్ కు రావడం లేదన్నది ఆలోచించడం లేదు. ఇందులో స్నాక్స్ ధరలు కూడా ఓ కారణం. ఇలా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు సినిమా పరిశ్రమ కుదేలు కావడానికి ఇవన్నీ తోడ్పడుతున్నాయి. వీటి గురించి ఆలోచించి సమస్యలు పరిష్కరిస్తేనే సామాన్యుడు థియేటర్ కు వస్తాడు.