రవితేజ క్రాక్ సినిమా చేస్తున్న సమయంలోనే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. క్రాక్ తర్వాత వెంటనే త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ సినిమా చేయాల్సి ఉంది. కాని రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ ఖిలాడి సినిమాను మొదలు పెట్టాడు. సరే ఖిలాడి తర్వాత అయినా రవితేజ.. త్రినాధరావు ల కాంబో మూవీ ఉంటుందని అంతా భావించారు. కాని ఖిలాడి తర్వాత కూడా రవితేజ మరో దర్శకుడితో సినిమాను కమిట్ అయ్యాడు. ఆ సినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో త్రినాథరావు నక్కని కొత్త సినిమా చర్చలు జరుగుతున్నట్లుగా ప్రచారం మొదలు అయ్యింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న గని మరియు ఎఫ్ 3 సినిమాల తర్వాత త్రినాథరావు దర్శకత్వంలో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో రవితేజతో సినిమా క్యాన్సిల్ అయినట్లే అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రవితేజ కు తగ్గ ఒక మంచి మాస్ కథతో ఆయన సినిమా చేస్తాడని అంతా భావిస్తూ ఉండగా వరుణ్ తేజ్ తో సినిమా కు రెడీ అవుతున్న నేపథ్యంలో అసలేం జరిగింది అంటూ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రవితేజ కథ కూడా నచ్చిన తర్వాత ఎందుకో సినిమా ను పట్టాలెక్కించలేదు. స్క్రిప్ట్ విషయంలో ఏమైనా తేడా కొట్టిందా లేదంటే బడ్జెట్ విషయంలో ఏదైనా సమస్య వచ్చిందా అంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయం ఏంటీ అనేది వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కాని తెలియదు. మరి వారు స్పందిస్తారేమో చూడాలి.