హ‌బ్బీ గురించి ఆలియా చెప్పిన గుట్టు మ‌ట్లు

Update: 2022-07-08 04:30 GMT
అత‌డు ముగ్గురు హీరోయిన్ ల‌ను ప్రేమించాడు. ఇద్ద‌రితో సీరియ‌స్ రిలేష‌న్ షిప్ కొన‌సాగించాడు. చాక్లెట్ బోయ్ లుక్ తో అస‌లు మ‌గువ‌ల కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌కుండా చేసాడు. కానీ చివ‌రికి తాను ప్రేమించిన నాయిక‌ల్లో ఒక నాయిక‌ను పెళ్లాడాడు.

అత‌డు ఎవ‌రో ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ది గ్రేట్ ర‌ణబీర్ క‌పూర్. ఇటీవ‌లే ఆలియాను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఆలియా కూడా మొద‌ట సిద్ధార్థ్ మ‌ల్హోత్రాను  ప్రేమించింది. కానీ ఆ త‌ర్వాత బ్రేక‌ప్ అయ్యింది. ర‌ణ‌బీర్ ని పెళ్లాడింది.

ఇక ఈ జంట పెళ్లిలో బోలెడ‌న్ని స‌రిగ‌మ‌లు. తాజాగా ఆలియా కాఫీ విత్ క‌ర‌ణ్ ఓటీటీ షోలో పాల్గొంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 7  మొదటి ఎపిసోడ్ ఇప్పటికే ప్రసారమైంది. ఇందులో రణవీర్ సింగ్- అలియా భట్ క‌ర‌ణ్ తో షోలో పాల్గొన్నారు.

కరణ్ జోహార్ వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త అంశాల‌తో పాటు ఎన్నో విష‌యాల‌ను ప్ర‌శ్నించ‌గా.. ఆలియాకు ఒక ఆస‌క్తిక‌ర  ప్ర‌శ్న ఎదురైంది.అలియా భట్ - రణబీర్ కపూర్ ల పెళ్లి ప్రతిపాదన ఎలా జరిగిందో చాలా మంది ఆశ్చర్యంలోనే ఉన్నారు. అందుకే ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. రణబీర్ తన పెళ్లికి ఎలా ప్రపోజ్ చేశాడో ఆలియా వెల్లడించింది

ఆలియా-ర‌ణ‌బీర్ ఇరువురి హృదయాలకు ఇష్ట‌మైన ఓ ప్రదేశంలో ఈ ప్రతిపాదన జ‌రిగింద‌ని తెలిపింది ఆలియా. అలాగే పెళ్లి వాయిదా పడినందున.. వారు దాని గురించి మాట్లాడటం మానేసార‌ట‌. మేం ఇరువురం గట్ ప్రవృత్తిని అనుసరించి దాని గురించి మాట్లాడటం మానేసినట్లు ఆలియా వెల్లడించింది.

రణబీర్ ఈ విషయాన్ని అందరికీ తెలియకుండా గోప్యంగా ఉంచాడని తెలిపింది. వృత్తిగ‌తంగానూ ర‌ణ‌బీర్ చాలా తెలివిగా కొన్నిటిని దాచి ఉంచుతాడ‌ని కూడా ఆలియా వెల్ల‌డించింది.
Tags:    

Similar News