తెలుగు ప్రేక్షకులకు జాంబీ జోనర్ ను తొలిసారిగా పరిచయం చేసిన చిత్రం ‘జాంబీ రెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలనివుంది’ చిత్రంతో వెండితెరకు పరిచయమై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన తేజ సజ్జా ఈ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.
అ, కల్కి వంటి ప్రయోగాత్మక సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ జాంబీ కామెడీ థ్రిల్లర్ పై మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ.. బాక్సాఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది. ఈ చిత్రం పీఆర్ టీం ప్రకారం.. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.4.63 కోట్లు వసూలు చేసిందట.
హాలీవుడ్ లో ఫేమస్ అయిన జాంబీ జోనర్ ను తెలుగులోకి తీసుకురావడమే కాకుండా.. దానికి రాయలసీమ ఫ్యాక్షన్ జోడించి, కామెడీని మిక్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్. ఈ సినిమాలో తేజాతో పాటు టాలెంటెడ్ హీరోయిన్లు ఆనంది, దక్షనాగర్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు.
వీరితోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రముఖ హాస్యనటులు కూడా ఇందులో నటించారు. రెండు రోజుల్లోనే రూ.4 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం వీకెండ్ ముగిసే నాటికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ సినిమాను ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మించారు.