విడాకుల జంట గురించి వాళ్లేమంటున్నారంటే?

Update: 2022-01-27 09:30 GMT
కోలీవుడ్ జంట ధ‌నుష్-ఐశ్వ‌ర్య విడాకుల ప్ర‌క‌ట‌న అభిమానుల్ని క‌ల‌చివేసిన సంగ‌తి తెలిసిందే. 18 ఏళ్ల ధాంప‌త్య జీవితానికి స్వ‌స్తి చెబుతూ ఎవ‌రికి వారు కొత్త ప్ర‌యాణాలు మొద‌లు పెట్ట‌డంపై కొంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. విడిపోవ‌డానికి కారణాలు ఏమైన‌ప్ప‌టికీ ఎవ‌రి  స్వేచ్ఛ వారు కోరుకున్నారు? అన్న‌ది గ్ర‌హించాల్సిన వాస్త‌వం. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇద్ద‌రు జంట‌గా హైద‌రాబాద్ లో ఒకే హోట‌ల్ లో బ‌స చేసిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు వేర్వేరు ప‌నుల‌పై హైద‌రాబాద్ కి వ‌చ్చారు. అనంత‌రం ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అయ్యారు. అయితే వీళ్ల‌ను నిశితంగా ప‌రిశీలించిన కొంద‌రు జంట గురించి ఆస‌క్తిక‌ర విషాయ‌లు చెబుతున్నారు.

ఐశ్వ‌ర్య ఏం జ‌ర‌గ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని...ప‌ని త‌ప్ప మ‌రో ధ్యాశ లేకుండా స‌మ‌యం గ‌డుపుతున్నార‌ని అంటున్నారు. స్నేహితుల్ని క‌ల‌వ‌డం...పార్టీల‌కు హాజ‌ర‌వ‌డం వంటివి చాలా కామ‌న్ గా జ‌రుగుతున్నాయ‌ని..త‌న ముఖంలో ఎం మాత్రం మ‌నోవేద‌న గానీ..బాధ‌కానీ క‌నిపించ‌లేద‌ని చెబుతున్నారు. ఇక ధ‌నుష్ షూటింగ్ కి హాజ‌రైనా షాట్ అనంత‌రం ఒంట‌రిగానే ఎక్కువ‌గా గ‌డుపుతున్నాడుట‌. ఎవ‌రితో మాట్లాడ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని.. అత‌ని ముఖంలో వెలితి స్ఫ‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని చూసిన వాళ్లు అంటున్నారు. అయితే ఆ జంట‌ల‌ను ఇలా చూసి ఓ నిర్ణ‌యానికి రావ‌డం క‌రెక్ట్  కాదు.

కొంత మంది చిరు న‌వ్వు వెనుక బాధ‌ని పంటికింద నొక్కి పెడ‌తారు. అంతటి సామర్ధ్యం కొంద‌రికే ఉంటుంది. పైకి న‌వ్వుతూ మాట్లాడినా..లోలోప‌ల ఎంతో కుమిలిపోతారు? అన్న‌ది గ్ర‌హించాల్సిన విష‌యం. ఇక ధ‌నుష్  నిస్ర్తాణంగా ఉండ‌టానికి కార‌ణం విడాకులా?  లేక ఇత‌ర మ‌రేమైనా కార‌ణాలు ఉన్నాయా? అన్న‌ది తెలియాలి. ఈ జంట విడాకుల కార‌ణం ధ‌నుష్ ఏఫైర్లు అని ఇప్ప‌టికే ప్ర‌చారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News