కెరీర్ ల్యాండ్ మార్క్ (30వ) సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు తారక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది. రెండు దశాబ్ధాల కెరీర్ లో ఒక స్టార్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు తారక్.అయితే అతడు నటించిన సినిమాల్లో నంబర్ వన్ ఏది? అంటే ఠకీమని సమాధానం చెప్పేయలేం. 30 సినిమాల్లో బ్లాక్ బస్టర్లు రికార్డ్ బ్రేకింగ్ హిట్లు ఉన్నాయి. అయితే ఓ పది సినిమాల ఓటింగ్ సరళిని చెక్ చేస్తే ఆశ్చర్యకరమైన ఫలితమే వచ్చింది.
ఓ ఆన్ లైన్ సర్వేలో.. ఓటింగ్ లో సింహాద్రి చిత్రం ది బెస్ట్ అని తేలింది. తారక్ నటించిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్.1 కి 243 ఓట్లు పోలయ్యాయి. ఇది 3.05 శాతం ఓట్లను దక్కించుకోగా.. ఆది చిత్రం 1246(15.65 శాతం) ఓట్లను దక్కించుకుంది. సింహాద్రి 2648 (33.25 శాతం) ఓట్లను సాధించగా.. యమదొంగ 253(3.18 శాతం) ఓట్లను దక్కించుకుంది.
అదుర్స్ 625 (7.85 శాతం) ఓట్లు .. ఆ తర్వాత టెంపర్ 1178 (14.79 శాతం) ఓట్లతో రేస్ లో ఉన్నాయి. నాన్నకు ప్రేమతో 590 (7.41 శాతం) ఓట్లను దక్కించుకోగా.. జనతా గ్యారేజ్ 528(6.63 శాతం) ఓట్లు పోలయ్యాయి. జై లవకుశ 208(2.61 శాతం) ఓట్లను దక్కించుకోగా.. అరవింద సమేత 444(5.58 శాతం) ఓట్లను దక్కించుకుంది.
మొత్తం 7963 ఓట్లు పోలవ్వగా ఒక్కో మూవీకి ఎంత శాతం వచ్చింది? అన్నదానిని బట్టి చూస్తే.. అన్నిటికంటే సింహాద్రి చిత్రానికి ఎక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. గ్లామర్ .. ఎమోషన్.. యాక్షన్ .. మాసిజం ఇలా అన్ని కోణాల్లో సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఒకవేళ రేస్ లో ఆర్.ఆర్.ఆర్ కూడా ఉంటే అదే ది బెస్ట్ అవుతుందేమో! ఈ మూవీ రిలీజై సంచలనాలు సృష్టించడం ఖాయమని తారక్ అభిమానులు నమ్ముతున్నారు.