చిరంజీవి స్వాతంత్య్ర దినోత్స‌వ‌ సందేశం.. రాజ‌కీయాల‌పై ఏమ‌న్నారంటే!

Update: 2022-08-15 09:59 GMT
దేశ 75వ స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని.. మెగా స్టార్ చిరంజీవి.. సందేశం ఇచ్చారు. హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయ‌న పాల్గొన్నారు. ఆయన మాతృమూర్తి అంజనాదేవి జాతీయ జెండాను ఎగురవేశారు.

అనంత‌రం మిఠాయిలు పంచారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛా జీవితమని.. 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకోవడం ఆనందగా ఉందని అన్నారు.

స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహనీయులను కన్న మాతృమూర్తులను సర్మించుకొని, వారికి నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నానని చెప్పారు. ఎందరో మహనీయుల త్యాగఫలమే ఈ వేడుకలని కొనియాడారు.

"75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ పండుగ చేసుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు, మహానీయుల త్యాగం వల్లే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. స్వాతంత్య్ర సమరంలోకి వెళ్లండి అంటూ ధైర్యంగా పంపించిన నాటి కన్న తల్లులను కొనియాడాలి. అలాంటి కన్నతల్లులను స్మరించుకొని నివాళులు ఆర్పించడం కనీస ధర్మంగా భావిస్తున్నా ను" అని చిరంజీవి సందేశం ఇచ్చారు.

రాజ‌కీయాల‌పై..అయితే.. సాధార‌ణంగా.. ప్ర‌ముఖ వ్య‌క్తులు.. జాతీయ జెండాను ఆవిష్క‌రించిన అనంత‌రం.. స్పందిస్తూ.. రాజ‌కీయాల‌పైనా త‌మ అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. చిరంజీవి మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిం చారు. ఆయ‌న ఎక్క‌డా రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో బీజేపీ వైపు చిరు చూస్తున్నార‌ని.. ఆ పార్టీ చిరంజీవిని త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో ఈ సంద‌ర్భంగా.

చిరు త‌న రాజ‌కీయ పునః ప్ర‌వేశం గురించి ఏమైనా మాట్లాడాతారేమోన‌ని అంద‌రూ ఎదురు చూశారు. కానీ.. ఎక్క‌డా ఆయ‌న స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎలాంటి పొలిటిక‌ల్ కామెంట్స్ లేకుండానే.. చిరు.. త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.
Tags:    

Similar News