కొన్ని వరుస పరాజయాల తర్వాత `ఛలో` తో నాగశౌర్యకు రిలీఫ్ దొరికింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. వెంకీ కుడుమల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పటికే నాగశౌర్యకు- వెంకీ కుడుముల స్నేహితుడు. హీరోగా నాగశౌర్య రాణిస్తుంటే...దర్శకుడిగా వెంకీ కుడుముల ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా ఇద్దరి మధ్య అనుకోకుండా స్నేహం కుదిరింది. వెంకీ వినిపించిన ఛలో స్క్రిప్ట్ నచ్చేయడంతో నాగశౌర్య సొంతంగా ఐరా క్రియేషన్స్ స్థాపించి తనే నటిస్తూ.. నిర్మించి అందుకున్న తొలి సక్సెస్ అది. ఈ జర్నీలో దర్శకుడికి నాగశౌర్య కుటుంబంతో సాన్నిహిత్యం మరింత బలపడింది.
ఆ సినిమా ప్రచారం సమయంలో నాగశౌర్య తల్లి శ్రీమతి ఉష .. దర్శకుడు వెంకీ తనకు కోడుకులాంటివాడు అని ఆప్యాయతను కనబరిచారు. ఛలో సక్సెస్ తర్వాత వెంకీ కుడుమలకు పారితోషికం కాకుండా ఓ ఖరీదైన కార్ ను బహుమతిగా కొనిచ్చారు. అనంతరం నాగశైర్య సొంత బ్యానర్లోనే సినిమాలు చేసాడు. వెంకీ బయట హీరోలతో అవకాశాలు రాడంతోనే తర్వాత ఆ కౌంపౌండ్ లో కనిపించలేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా భీష్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా వెంకీ కుడుముల-నాగశౌర్య మధ్య పచ్చగడ్డి వేస్త భగ్గుమనే స్థాయిలో వివాదాలున్నాయన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఛలో సక్సెస్ అయిన కొన్ని నెలలకే వెంకీ కుడుమలకు ఆ ఫ్యామిలీతో ఉన్న మైత్రీ చెండిందిట. నిర్మాత కొనిచ్చిన కారును వాడటం మానేసి.. తనే స్వయంగా ఓ కార్ కొనుక్కున్నాడుట. ఆ కాంపౌండ్ నుంచి కాల్ వస్తే ఫోన్ స్విచ్ఛాప్ చేస్తాడట.
ఇటీవలే అశ్వథ్థామ ప్రమోషన్ కార్యక్రమంలో నాగశౌర్యను ఇవే విషయాలపై ప్రశ్నించగా వెంకీ కుడుముల పై సీరియస్ అయ్యాడు. అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు. బహుశా ఇదే అతని అసలు స్వభావం కావొచ్చు. నాలుగేళ్ల స్నేహంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒకవేళ మనసు మర్చుకుని మళ్లీ ఆయన ఇటు వైపు వస్తానన్నా రానివ్వను అంటూ కుండబద్దలు కొట్టేసాడు. దీంతో అసలు వీళ్లిద్ధరి మధ్య వివాదానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆసక్తికర చర్చ మొదలైంది. దర్శకుడిగా పరిచయం చేసిన హీరోని.. కొడుకులా చూసుకున్న ఫ్యామిలీని స్టార్ హీరోలతో అవకాశం వచ్చేసరికి అప్పుడే మర్చిపోయాడా? అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.