సుశాంత్ చనిపోయిన ముందురోజు ఏమి జరిగింది...?

Update: 2020-08-01 09:50 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసు మిస్ట‌రీ థ్రిల్లర్ ని తలపిస్తూ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను సుశాంత్ తో సన్నిహితంగా ఉండేవారిని విచారించారు. అయితే ఇటీవల సుశాంత్ తండ్రి రియాపై పాట్నాలో ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు సుశాంత్ సూసైడ్ కేసులో బీహార్ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. ముంబై పోలీసులు విచారణలో ఈ కేసుకి సంబంధించి ఒక రకమైన ఆధారాలు కనుగొంటే ఇప్పుడు బీహార్ పోలీసులు మరో రకమైన అంశాలను కనుగొంటున్నారని సమాచారం. ఇప్పటికే ముంబై పోలీసులు సుశాంత్ చాలా రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారా.. సుశాంత్ చనిపోవడానికి ముందు ఏం జరిగింది అనే విషయాలపై విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఆ రోజు సీసీటీవీ పని చేయలేదని... సుశాంత్ జూన్ 13న బాంద్రాలోని తన ఇంట్లో పార్టీ చేసుకున్నట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.

కాగా ఇప్పుడు బీహార్ పోలీసుల విచారణలో భాగంగా సుశాంత్ సింగ్ ఇంట్లో పని చేసే వ్యక్తితో మాట్లాడారు. సుశాంత్ ఇంట్లో జూన్ 13న ఎలాంటి పార్టీలు జరగలేదని.. డిన్నర్ చేసిన వెంటనే సుశాంత్ నిద్రపోయాడని.. జూన్ 14వ తేదీన కూడా ఉదయమే నిద్ర లేచాడని చెప్పి సుశాంత్ సర్వెంట్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో సుశాంత్ చనిపోయిన ముందు రోజు హ్యాపీగా పార్టీ చేసుకున్నట్లు ముంబై పోలీసులు చెప్పడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అసలు సుశాంత్ ఇంట్లో జూన్ 13న ఏమి జరిగింది.. దీనిపై ఎందుకు విభిన్న కథనాలు వెలువడుతున్నాయి అనే కోణంలో ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు. దీనికి తోడు బీహార్ పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ కాకుండా ముంబై పోలీసులే కేసును విచారణ జరపాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టుకు వెళ్లడంపై కూడా అందరిని షాక్ కి గురి చేసింది. ఇక ఈ కేసులో తనకి న్యాయం జరుగుతుందని.. దేవుడిపై న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. సత్యమేవ జయతే అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది రియా. ఈ విధంగా రోజుకొక మలుపు తిరుగున్న సుశాంత్ సూసైడ్ కేసు ఎప్పుడు కొలిక్కి వస్తుందో చూడాలి.
Tags:    

Similar News