భారీ చిత్రాల‌న్నీ వ‌చ్చేస్తున్నాయ్.. ఆ సినిమా రాదే

Update: 2022-03-24 23:30 GMT
క‌రోనా కార‌ణంగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌డానికి జంకిన బిగ్ స్టార్స్ సినిమాల‌న్నీ ప‌రిస్థితులు మార‌డం.. జ‌నాలు థియేట‌ర్ల‌కు అల‌వాటు ప‌డ‌టంతో డిసెంబ‌ర్ నుంచి భారీ చిత్రాల‌న్నీ వ‌రుస క‌ట్టాయి. అయితే ఒకే ఒక్క సినిమా మాత్రం ఇంత వ‌ర‌కు ల్యాబ్ నుంచి బ‌య‌టికి రావ‌డానికి జంకుతోంది. డిసెంబ‌ర్ లో అఖండ ఆక‌ట్టుకుంది. ఆ త‌రువాత వ‌చ్చిన `పుష్ప‌` బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. శ్యామ్ సింగ‌రాయ్ అందినకాడికి స‌ర్దేసింది. ఈ మూడు చిత్రాలు గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో విడుద‌లై ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వున్న భ‌యాల్ని పోగొట్టాయి.

ఆ త‌రువాత జ‌న‌వ‌రి నుంచి మ‌రో జాత‌ర మొద‌లైంది. బంగార్రాజు దిగేశాడు. సంక్రాంతికి విడుద‌లైన ఈ మూవీ ఫ‌ర‌వాలేద‌నిపించింది. ఆ త‌రువాత ఫిబ్ర‌వ‌రిలో మ‌రో జాత‌ర మొద‌లైంది. `డీజే టిల్లు` సైలెంట్ గా వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద ఓ రేంజ్ లో డీజే మోత మోగించి చిన్న చిత్రాల్లో పెద్ద‌ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ `భీమ్లానాయ‌క్‌` ఎంట్రీతో థియేట‌ర్ల వ‌ద్ద మాస్ జాత‌ర మొద‌లైంది.

మార్చి 11న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ `రాధేశ్యామ్‌` విడుద‌లైంది. టాక్ డివైడ్ గా వ‌నిపించినా బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం సాలీడ్ ఫిగ‌ర్ ని రాబ‌ట్టింది. ఈ శుక్ర‌వారం ట్రిపుల్ ఆర్ తో ఈ నెల‌కు ఎండ్ కార్డ్ ప‌డ‌బోతోంది. వ‌చ్చే నెల కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తో భార‌తీయ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ ల ప‌రంగా స‌రికొత్త చాప్ట‌ర్ ఆవిష్కృతం కాబోతోంది. ఇలా భారీ క్రేజీ చిత్రాల‌న్నీ వ‌రుస పెట్టి థియేర్ల‌పై దండ‌యాత్ర చేస్తుంటే ఒక్క మూవీ మాత్రం కిమ్మ‌న‌కుండా సైలెంట్ గా వుండ‌టం, మేక‌ర్స్ నుంచి ఎలాంటి స్పంద‌న లేక‌పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

అదే `విరాట ప‌ర్వం`. రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన ఈ చిత్రం గ‌త ఏడాది ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సింది. క‌రోనా కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని అన్ని చిత్రాల‌తో పాటే వాయిదా వేశారు. బ్యాక్ టు బ్యాక్ మిగ‌తా చిత్రాల మేక‌ర్స్ త‌మ చిత్రాల‌ని వ‌రుస‌గా రిలీజ్ చేస్తుంటే `విరాట‌ప‌ర్వం` మాత్రం నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్ రావ‌డం లేదు. ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల కూడా మౌనం పాటిస్తున్నాడు. ఎవ‌రు రిలీజ్ గురించి అడిగినా మౌన‌మే ఆయ‌న స‌మాధానంగా వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేష‌న్ తో రూపొందించిన ఈ మూవీని ఎందుకు విడుద‌ల చేయ‌డం లేద‌న్న‌ది ప్ర‌తీ సినీ ల‌వ‌ర్ మెద‌డుని తొలిచేస్తోంది. ఇందుకు సురేష్ బాబు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని కొంత మంది వాదిస్తున్నారు. ఇటీవ‌ల నార‌ప్ప‌, దృశ్యం 2 చిత్రాల‌ని ఓటీటీలో విడుద‌ల చేశారు సురేష్ బాబు. అదే పంథాలో ఈ మూవీని కూడా ఓటీటీకే ఇచ్చేస్తున్నారంటూ వార్త‌లు వినిపించాయి.

కానీ మేక‌ర్స్ నుంచి దీనిపై ఎలాంటి స్పంద‌న లేదు. 1990వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ‌లో న‌క్స‌ల్స్ ఉద్య‌మం పీక్స్ లో వుంది. ఆనాటి య‌దార్థ సంఘ‌న‌ట‌ల స‌మాహారంగా ఉత్త‌ర తెలంగాణ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

 ప్రారంభం నేంచే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీ కోసం ఆడియ‌న్స్ చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ కి సంబంధించిన అప్ డేట్ ని మాత్రం మేక‌ర్స్ ఇవ్వ‌డం లేదు. దీంతో సినీ ల‌వ‌ర్స్ ఇంత మంది చిత్రాన్ని ఎందుకు హోల్డ్ లో పెట్టార‌ని మేక‌ర్స్ పై కామెంట్ లు చేస్తున్నార‌ట‌.
Tags:    

Similar News